విద్యుత్ తీగలే కాదు,కరెంటు బిల్లులు పట్టుకున్న షాక్
1 min readకరెంటు చార్జీల పెంపుపై ఎమ్మిగనూరు పట్టణంలో వైయస్ఆర్ సిపి నిరసన ర్యాలీ, విద్యతు కార్యక్రమం ముందు ధర్నా మరియు ఎమ్మిగనూరు విద్యుత్ శాఖ డి.ఈ,ఏ.డి,ఏ.ఈ లకు వినతి పత్రం అందజేత
పల్లెవెలుగు న్యూస్ ఎమ్మిగనూరు: పట్టణంలో ప్రజలపై కరెంటు చార్జీల భారాన్ని మోపుతున్న కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ఎమ్మిగనూరు పట్టణంలో వైయస్ఆర్ సిపి ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించబడింది. వైయస్ఆర్ కూడలి నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు జరిగిన ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు మద్దతు తో విద్యుత్ శాఖ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి డి.ఈ,ఏ.డి,ఏ.ఈ గార్లకు వినతి పత్రం అందజేశారు._కార్యక్రమానికి నాయకత్వం వహించిన శ్రీమతి బుట్టా రేణుక మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారుకూటమి ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే విధంగా చర్యలు తీసుకుంటుందని ఆమె విమర్శించారు.ఎస్సీ, ఎస్టీ కుటుంబాల పట్ల అన్యాయం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తొలగించబడడంతో వలన, వారికి తీవ్ర ఆర్థిక భారం ఏర్పడిందని చెప్పారు.వ్యవసాయ రంగానికి సహాయం లేకపోవడం: రైతులు విద్యుత్ కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని, వెంటనే వీటిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.కరెంటు చార్జీల పెంపును రద్దు చేయాలి: ప్రభుత్వం ప్రజల భవిష్యత్తు దృష్ట్యా ఈ పెంపును తక్షణమే నిలిపివేయాలి.ట్రూ అప్ చార్జీల భారం వెనక్కి తీసుకోవాలి: రూ.15,485 కోట్ల చార్జీల భారాన్ని ప్రజలపై మోపడం అన్యాయం.ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు పునరుద్ధరించాలి: ఇది వారి ఆర్థిక స్థిరత్వానికి అనివార్యం.వ్యవసాయ పంపు సెట్ల కనెక్షన్లను వెంటనే మంజూరు చేయాలి: రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని చర్యలుతీసుకోవాలి.ఈ ర్యాలీకి సామాన్య ప్రజల నుంచి విస్తృత మద్దతు లభించింది. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ నిరసన వ్యక్తం చేశారు. బిల్లుల పెంపుతో బాధపడుతున్న కుటుంబాలు తమ ఆందోళనను ప్రభుత్వానికి వినిపించేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికగా మారింది.ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు, వారి సమస్యలకు న్యాయం చేయడంలో వైయస్ఆర్ సిపి ఎల్లప్పుడూ ముందుంటుందని శ్రీమతి బుట్టా రేణుక స్పష్టంచేశారు.ఈకార్యక్రమంలో వీరశైవ లింగాయత్ రాష్ట్ర అధ్యక్షులు వై రుద్ర గౌడ్ ,ఎమ్మిగనూరు మండల కన్వీనర్ బి.ఆర్ బసిరెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి కాంత్ రెడ్డి ,మాజీ,నందవరం మండల కన్వీనర్ శివ రెడ్డి గౌడ్ మాజీ ఎల్.ఎల్.డైరెక్టర్ గడ్డం నారాయణ రెడ్డి , నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు వీరుపాక్షి రెడ్డి ,గొనెగండ్ల మండల నాయకులు బందేనవాజ్ ,వైస్ చైర్మెన్ డి నజీర్ అహమ్మద్ ,కామర్తి నాగేషప్ప ,చేనేత జిల్లా అధ్యక్షులు యం.కే శివ ప్రసాద్,సమాచారం హక్కు చట్టం జిల్లా అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి,పట్టణ అధికారా ప్రతినిధి సునీల్ కుమార్ ,మాజీ ఎంపిపి కృష్ణ రెడ్డి ,కోటేకల్ లక్ష్మన్న,దొరబాబు,మన్సూర్, రాష్ట్ర/జిల్లా/నియోజకవర్గ/మండల/ పట్టణ/ గ్రామ స్థాయి అనుబంధ విభాగాల సభ్యులు,ఎంపీపీలు,జెట్పిటీసీలు,ఎంపిటీసీలు,సర్పంచులు,అధికార ప్రతినిదులు,కో అప్షన్ మెంబర్లు,కౌన్సిలర్లు,ఇంచార్జులు, సచివాలయ,కన్వీనర్లు,గృహ సారదులు,నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.