బాలసదన్ లో ఉన్న పిల్లలకు నోట్ బుక్స్, పెన్నులు అందజేత
1 min readవిద్యార్ధులు మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
కార్యక్రమంలో పాల్గొన్న ఐసిడిఎస్
పిడి పీ.శారద, సంరక్షణ అధికారిణి సి.హెచ్ సూర్య చక్ర వేణి
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి:జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయటానికి వచ్చికలిసిన ప్రముఖులందరూ అందజేసిన నోట్ బుక్స్ , పెన్సిల్స్ , స్కేల్స్ , కలర్ పెన్సిల్స్ , పెన్నులు పిల్లలకి అవసరమైన వస్తువులను దెందులూరు బాలసదన్ లోని బాలలందరికీ జిల్లా కలెక్టర్ బుధవారం బాలసదన్ కు వెళ్లి అందచేసి వారితో కలిసి ఆటలాడి బాలలదరిలోనూ నూతన సంవత్సరంలో కొత్త శోభను సంతరించుకునే విధంగా సంతోషాన్ని, వెలుగులను నింపారు. వారందరికి జిల్లా కలెక్టర్ గా భరోసాని కల్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కె .వెట్రి సెల్వి పిల్లలతో చెస్ఆడి, యోగాసనాలు నేర్పించడం ,పాటలు పాడించడం, డాన్సులు వేయించి తిలకించారు. చదువుల్లో వారు సాధిస్తున్న ప్రగతి, ఆరోగ్య భధ్రత, వారికి అందిస్తున్న ఆహార మెనూ వివరాలను, ఇతర సౌకర్యాలు అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి బాలసదన్ సూపరింటెండెంట్ కు తగు సూచనలు ఇచ్చారు. తనకు ఏమాత్రం విరామం దొరికినా చిన్నారులతో గడిపేందుకు ప్రయత్నిస్తానని వారితో గడిపి ఆనందం పొందుతానని కలెక్టర్ తెలిపారు. బాలసదన్ లో ఉన్న ఇద్దరు చిన్నారుల పుట్టనరోజు పురస్కరించుకొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కొత్త దుస్తులు అందజేశారు. విద్యార్ధులు మంచి మార్కులు సాధించి ఉన్నతమైన స్ధానానికి ఎదగాలని ఆమె పిల్లలకు ప్రభోధించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు దెందులూరు తహశీల్దారు బి. సుమతి, జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి పి శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్యచక్ర వేణి, బాలసదన్ సూపరింటెండెంట్ ఎస్. బేబీ సరోజిని, బాలసదన్ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.