నవంబర్ 7 గర్భస్థ శిశు దినోత్సవం
1 min readక్రాడిల్ రిసెప్షన్ సెంటర్ ను పునరుద్దించిన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్న ప్రసాద్
సమాచారం అందించవలసిన ఫోన్ నంబర్స్ 1098,100,181
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ , ఏలూరు వారి ఆధ్వర్యంలో ఏలూరులోని కొత్త బస్టాండ్ నందు క్రాడిల్ రిసెప్షన్ సెంటర్ ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్నప్రసాద్ పునరుద్దించారు. నవంబరు 7వ తేదీన గర్భస్థ శిశు దినోత్సవ సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా క్రాడిల్ రిసెప్షన్ సెంటర్, చంటి బిడ్డల తల్లులు పాలిచ్చే గదులను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్న ప్రసాద్ మాట్లాడుతూ ఎవరైనా వద్దు అనుకున్న బిడ్డలను రోడ్డు ప్రక్కన, కాలవల్లోనూ మరియు చెత్త బుట్టలలోను విడిచి పెట్టకుండా, ఇటువంటి ఉయ్యాల నందు విడిచిపెట్టాలని, అలాగే 1098 లేదా 100 మరియు 181 కానీ ఫోన్ చేసి సమాచారాన్ని తెలియచేయాలని, అలా తెలియజేసిన వారి యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని సూచించారు. అలాగే ఆ బిడ్డల రక్షణను అధికారులు తీసుకుంటారని, వారిని సంరక్షించడం లేదా చట్ట ప్రకారం దత్తత ఇవ్వడం చేస్తారని తెలియజేశారు. కావున పౌరులు బాధ్యతతో సమాచారాన్ని అధికారులకు చేరవేయాలని సూచించారు. ఈ క్రాడిల్ రిసెప్షన్ సెంటర్లు కొత్త బస్టాండ్, గవర్నమెంట్ హాస్పిటల్ మరియు శిశు గృహ నందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ ప్రాజెక్టు డైరెక్టర్ పి పద్మావతి, డి.సి.పి ఓ సూర్యచక్రవేణి తదితరులు పాల్గొన్నారు.