పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ఘనత ఎన్టీఆర్..
1 min readమిడుతూరులో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని మిడుతూరు మండల టీడీపీ కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి అన్నారు.శనివారం ఉదయం నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించి ఎన్టీఆర్ చిత్రపటానికి మాజీ సర్పంచ్ లు వెంకటేశ్వర రెడ్డి,టి నాగేంద్రుడు,కమతం రాజశేఖర్ రెడ్డి,వీరారెడ్డి,శేషి రెడ్డి పూల మాలలతో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కాత రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ 1982 లో తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి తక్కువ సమయంలో 9 నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారని పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని నేటికీ ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం రెండుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారని ప్రజల్లో చెరగని ముద్ర వేశారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రెడ్డి,మండల యువ నాయకులు ప్రమోద్ రెడ్డి,చాంద్ బాష పాల్గొన్నారు.