తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్
1 min readవృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనం వడ్డీంచి చలి దుప్పట్లు అందజేత
మంత్రాలయం లో స్వచ్ఛత దివాస్ కార్యక్రమాన్ని అధికారులతో ప్రారంభించిన టిడిపి ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో స్వర్గీయ నందమూరి తారక రామారావు 29 వ వర్ధంతి సందర్భంగా టిడిపి జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం టిడిపి పార్టీ ని స్థాపించి ఎనిమిది నెలలోనే అధికారం చేపట్టిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు . సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని భావించిన మహనీయుడు అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన రెండు రూపాయల కు కిలో బియ్యం ఇప్పటికీ అమలు చేస్తున్నారని తెలిపారు. ఆయన వ్యక్తి కాదు శక్తి అన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దేవుడు ఎన్టీఆర్ అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ప్రజల కు సేవలు చేయడానికి మేము ఉన్నామని తెలిపారు. అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి భోజనాన్ని ఏర్పాటు చేసి తన సేవ దృక్పథాన్ని చాటుకున్న రాఘవేంద్ర రెడ్డి, తర్వాత “”స్వచ్ఛత దివాస్””లో పాల్గొని మంత్రాలయం ని క్లీన్ అండ్ గ్రీన్ నియోజకవర్గంగా ఏర్పర్చుకోవడం మనందరి బాధ్యత అంటూ అధికారులు నాయకులు కార్యకర్తలతో పాటు రోడ్లను క్లీన్ చేసి ఇది మన బాధ్యత అంటూ అందరికీ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు రాఖేష్ రెడ్డి, ఎంపీడీఓ శోభారాణి,టిడిపి మండల నాయకులు సింగరాజుహళ్లి మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి ఆర్. లక్ష్మయ్య , జిల్లా అధికార ప్రతినిధి చావిడి వెంకటేష్,స్థానిక నాయకులు అశోక్ రెడ్డి వరదరాజులు, ,డిసిసి తిమ్మప్ప , ఎంపిటిసి సభ్యులు మేకల వెంకటేష్, హైస్కూల్ ఛైర్మెన్ నరసింహులు, గుడిసే రాజన్న, మడ్రి శివ, రాఘవేంద్ర, శేఖర్, బావిగడ్డ రాఘన్న, మాలపల్లి లక్ష్మన్న, సూగురు నరసింహులు, మాలపల్లి చంద్ర రచ్చమరి నాయకులు పోలి శివ, వీరేష్, సుంకేశ్వరి, సూగురు, మాధవరం, చిలకలడోణ తదితర గ్రామాల టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.