నందికొట్కూర్ లో ఎన్టీఆర్ వర్ధంతి..
1 min readరక్తదానం చేసిన వారిని అభినందించిన ఎమ్మెల్యే
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు 29వ వర్ధంతిని నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం పట్టణంలోని వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం అల్వాల సత్రంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం యువకులు మరియు టీడీపీ కార్యకర్తలు ముందుకు వచ్చి రక్తదానం చేశారు.రక్తదానం చేసిన వారందరికీ పండ్లు అందజేస్తూ ఎమ్మెల్యే గిత్త జయసూర్య వారిని అభినందించారు.ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి సినీ నాటక రంగంలోనే కాకుండా తెలుగుదేశం పార్టీని స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు నేటికీ కంటికి అద్దంలా కనపడుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. అంతేకాకుండా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ,పలుచాని మహేశ్వర్ రెడ్డి,కాతా రమేష్ రెడ్డి,కౌన్సిలర్లు భాస్కర్ రెడ్డి, జాకీర్ హుస్సేన్,కమతం రాజశేఖర్ రెడ్డి,వీరారెడ్డి, నాగేంద్రుడు,మధు,సౌదీ చాంద్,ముర్తు జావలి,డాక్టర్ వనజ,మీనాక్షి,మిడతూరు మండల యువ నాయకులు ప్రమోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.