జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూజివీడు సబ్ కలెక్టర్
1 min readజిల్లా కలెక్టర్ కి పూలమొక్క అందజేసిన సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: నూజివీడు సబ్ కలెక్టర్ గా నియమితులైన బచ్చు స్మరణ్ రాజ్ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వారిని శుక్రవారం నూజివీడు ట్రిపుల్ ఐటి లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వికి సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్ పూలమొక్కను అందజేశారు. ఈ సందర్బంగా శుక్రవారం విధుల్లో చేరిన సబ్ కలెక్టర్ కు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి శుభాకాంక్షలు తెలిపారు. సివిల్స్ 676 ర్యాంక్ విజేత అయిన స్మరణ్ రాజ్ (2022 ఐఎఎస్ బ్యాచ్) చెన్నై ఐఐటిలో కెమికల్ ఇంజనీరింగ్(బిటెక్) పూర్తిచేశారు.