గర్భవతులు బాలింతలకు చిరుధాన్యాల మిశ్రమం, పౌష్టికాహారం తప్పనిసరి
1 min readమండల సెక్టార్ సిడిపిఓ రమాదేవి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: గర్భిణీలకు, బాలింతలకు చిరుధాన్యాల మిశ్రమం, పౌష్టిక ఆహారం తప్పనిసరని పోషణ మాసోత్సవాల్లో చెన్నూరు సెక్టార్ లో సిడిపిఓ రమాదేవి చెన్నూరు ఎనిమిదవ అంగన్వాడి కేంద్రం నందు చిరుధాన్యాల వాడకము చిరుధాన్యాలతో ఆకుకూరలు వేసి రొట్టె చేయడం ప్రత్యక్షంగా తల్లులతో చేయించడం చూపించడం జరిగింది . అదేవిధంగా చిరుధాన్యాలతో మిశ్రమ ఆహారం వండుకోవడము ఆహార వండుకునే పద్ధతుల గురించి తెలిపారు ఎక్కువగా వారంలో నాలుగు రోజులు ఆకుకూరలు ఆహారంలో తీసుకోవాలని అదేవిధంగా కూరగాయలు సీజనల్ లో దొరికే పండ్లను ప్రతిరోజు తినడం వలన రోగ నిరోధక శక్తి కలిగి ఉండడం వలన అనారోగ్యానికి గురి కాకుండా ఉండడానికి దోహదపడుతుందని ప్రతి రోజు కూడా ఒక మనిషి మూడు లీటర్లు మంచినీరు రావడం వలన ఆరోగ్యంగా ఉంటారని చిరుధాన్యాలు వాడడం వలన జీవనశైలిలో వస్తున్నటువంటి షుగర్ బిపి క్యాన్సర్ వంటి జబ్బులకు గురికాకుండా ఉండడానికి సహాయపడతాయని తెలపడం జరిగింది. బాలింతలు తినే ఆహారం పైన వారి ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని తెలిపారు. కార్బోహైడ్రేట్స్, ఫైబర్, సూక్ష్మ పోషక అన్ని ఉండేలా చూసుకోవాలి. ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 1 నుండి ఇదివరకు పోషక మహోత్సవాలు ఒప్పుకుంటామని తెలియజేశారు. పండ్లు తగిన మోతాదులో తీసుకుంటే రక్తం అభివృద్ధి చెందుతుందని ఆమె తెలిపారు. తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని వారి పెరుగుదలకు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ గురమ్మ అంగన్వాడి కార్యకర్తలు ఇందిరమ్మ తులసి గర్భవతులు బాలింతలు మరియు పెద్దలు, పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు.