PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగులకు  కోర్సుల పట్ల అధికారులు అవగాహన కల్పించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (దూర విద్యా విధానం) ద్వారా అందిస్తున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ ఎ.  మధుసూదనరావు అధికారులకు సూచించారు. గురువారం 08.08.2024 న డిఆర్ఓ చాంబర్ లో విద్యాశాఖ మరియు సంబంధిత శాఖల జిల్లా అధికారులతో  డిఆర్ఓ సమావేశం నిర్వహించి APOSS పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో 2024-25 లో ప్రవేశాలు పెంపునకు తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా Aposs అడ్మిషన్లు- 2024-25 గోడ పత్రిక ను,  కరపత్రాలు ను విడుదల చేశారు.ఈ సందర్భంగా డి.ఆర్.ఓ శ్రీ ఎ.  మధుసూదనరావు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల  కార్యాలయాల్లో ఉద్యోగులు పదోన్నతుల కోసం పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులు చేయడానికి ఇది ఎంతో ఉపయోగకంగా ఉంటుందని, కావున వారి వారి శాఖలలో అవసరమైన ఉద్యోగులకు ఈ కోర్సుల పట్ల అధికారులు అవగాహన కల్పించాలన్నారు. శెలవు రోజుల్లో మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నారు, ఇష్టమైన ఏవైనా 5 సబ్జెక్టులుతో కోర్సులు పూర్తి చేయవచ్చు అని,  పాఠ్య పుస్తకాలు అభ్యర్థులు ఇంటికే పంపిణీ చేస్తారు అని, వెనకబడిన వర్గాల కు ఫీజు రాయితీ ఉన్నదని, అదేవిధంగా అధికారులు, ఉద్యోగులు వారికి తెలిసిన వారికి ఈ సమాచారం అందించి ఈ కోర్సులలో ప్రవేశాల పెంపునకు కృషి చేయాలని సూచించారు. విద్యాశాఖ జిల్లా  ప్రభుత్వ పరీక్షల  అసిస్టెంట్ కమిషనర్/ ఓపెన్ స్కూల్ జిల్లా సమన్వయ కర్త శ్రీ జి.చంద్ర భూషణ రావు ఈ సమావేశంలో మాట్లాడుతూ ఎలాంటి విద్యార్హత లేకున్నా 14 సం. నిండిన వారు పదవ తరగతిలో ప్రవేశానికి అర్హులని, 10వ తరగతి పాసైన వారు ఇంటర్మీడియట్ కోర్సు చేయడానికి అర్హులని తెలిపారు. మహిళలు, పలు వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి, ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు, వివిధ సంఘ సభ్యులకు ఇదొక చక్కని సదవకాశం. ఈనెల 28వ తేదీలోగా నిర్దేశించిన కోర్సు రుసుం చెల్లించి పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో ప్రవేశాలు పొందవచ్చని, 200 రూపాయల ఫైన్ తో సెప్టెంబర్ 4 వరకు చెల్లించవచ్చన్నారు.

About Author