PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధికారులారా కార్మికుల కడుపు కొట్టొద్దు.. జిల్లా ఐఎన్టీయూసీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:      కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కార్మికుల కడుపు కొట్టొద్దు అని కర్నూలు జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు బి బతకన్న మున్సిపల్ అధికారులను కోరారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పత్రికా ప్రకటనలో బతుకన్నగారు మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు కర్నూల్ వారికి విన్నవించుకొనడమేమనగా అయ్యా ఇప్పుడున్న కార్మికులను తీసివేస్తామని అంటున్నారు మన కర్నూలు పట్టణ విస్తరణ పెరిగిపోతుంది ఇప్పుడున్న కార్మికులు కాలువలు పూడికలు తీసివేయడానికి గాని రోడ్లు క్లీనింగ్ చేయడానికి చాలడం లేదు చాలా కాలం నుంచి అసలు కాలువలలో పూడికలు తీయడం లేదు అధికారులను అడిగితే స్టాప్ తక్కువగా ఉంది పూడిక తీసుకువెయ్యడానికి కార్మికులు సరిపోవడం లేదు అని అంటున్నారు. కానీ యిప్పుడు పనిచేస్తున్న 180మంది కార్మికులని తీసివేస్తామని అంటున్నారు కర్నూలు పట్టణంలో ఇప్పటికే చాలా ఫ్యాక్టరీలు, పేపర్ మిల్లు కార్బెడ్ కంపెనీ గాని, బిర్లా కంపెనీ గాని గతంలో ఉన్న ఫ్యాక్టరీలన్నీ బందు చేసినారు. చాలామంది చదువుకున్న వారు నిరుద్యోగులుగా మిగిలిపోయారు. అటువంటివారు మున్సిపాల్ కార్పొరేషన్ కాలువలో పూడిక తీసివేయడానికి అడిగితే వారి యొక్క చదువులు పక్కన పెట్టి కూడా మాకు జీవన ఉపాధి ఉంటే చాలు అని మేము ఏ పనైనా చేస్తామని ముందుకు వచ్చి కార్పొరేషన్ వారు అప్పజెప్పిన పనిని చేస్తూ జీవిస్తున్నారు. అయితే ఇప్పుడు వారిని తొలగించినచో వారి యొక్క పరిస్థితి ఏంటి? వారిని మున్సిపార్టీలో పనిచేయడానికి తీసుకునేటప్పుడు మిమ్మల్ని తీసివేయమని మీకు పర్మనెంట్ అవుతుందని అబద్ధపు మాటలు చెప్పి వారిని పనిలోకి పెట్టుకున్నారు. వారు గతంలో ఇతర పనులు వదిలేసి మీ దగ్గరికి వచ్చినందుకు ఇదేనా మీరిచ్చే బహుమానం గతంలో కూడా చాలామంది కార్మికులను ఈ విధంగా పనిచేయడానికి పెట్టుకొని వారిని తీసివేయడం జరిగింది. ఇప్పుడు వీరికి కూడా అదే పరిస్థితి ఏర్పడింది కాబట్టి కార్పొరేషన్ అధికారులారా కార్మికులని తీసివేసే నిర్ణయాలు మానుకోండి ఒక కార్మికుని మీద కుటుంబ భారం ఉంటుంది వారి పరిస్థితి ఏమైతదో తెలియదు కాబట్టి కార్మికుల మీద దయవుంచి కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్న మీ నిర్ణయాన్ని విరమించుకోవాలని జిల్లా ఐ ఎన్ టి యు సి తరఫున కోరుచున్నాము. ఒకవేళ మీ నిర్ణయం ఆ విధంగానే ఉంటే కార్మికుల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలను కలిసి ధర్నాలు నిరసనలు చేపడుతామని బతకన్నగారు తెలియజేశారు.

About Author