క్షేత్రస్థాయిలో అధికారులు ప్రతి ఇంటిని దర్శించాలి..
1 min readసుమోటో కూల ధ్రువీకరణ పై క్షేత్రస్థాయిలో అధికారులు ప్రతి ఇంటిని దర్శించాలి
జిల్లా జాయింట్ కలెక్టర్ బి. నవ్య
పల్లెవెలుగు వెబ్ ఆదోని: సుమోటో కూల ధ్రువీకరణ పై క్షేత్రస్థాయిలో అధికారులు ప్రతి ఇంటిని దర్శించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. నవ్య పేర్కొన్నారు. శనివారం పెద్దకడబూరు మండలం హనుమపురం గ్రామం లో సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్ పై క్షేత్రస్థాయిలో జిల్లా జాయింట్ కలెక్టర్ పాల్గొని గ్రామంలో ఉన్న ఇంటిని సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… గ్రామస్థాయిలో ఉన్న అధికారులు పూర్తిస్థాయిల విచారణ చేసి నివేదికలో పంపాలన్నారు. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే వాటిపై విచారణ చేసి రిపోర్టుని ఉన్నతాధికారులకు అందజేయాలన్నారు. ప్రతి ఒక్క అధికారి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటిని వెళ్లి విచారణ చేసి నివేదికలు అందజేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ (ఇన్చార్జి) సి. విశ్వనాథ్, తహశీల్దారు శ్రీనివాసులు, రెవెన్యూ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.