ఉద్యోగుల పాత బకాయిలు వెంటనే చెల్లించాలి: ఆప్టా
1 min readపల్లెవెలుగు వెబ్ అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి సుమారు ఆరు నెలలకు కావస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల పెండింగ్లో ఉన్న పాత బకాయిలు ఊసే లేదని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగుల పాత బకాయిలు వెంటనే చెల్లిస్తాదని ఆశపడిన ఉద్యోగులకు నిరాశ తప్పడం లేదు , కావున గౌరవ ముఖ్యమంత్రివర్యులు వెంటనే ఉద్యోగుల పాత బకాయిలను చెల్లించాలని ఆప్టా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏ జి ఎస్ గణపతి రావు ,కె ప్రకాష్ రావుల కోరారు , 2022 సంవత్సరము మే నెల నుంచి ఇప్పటివరకు పెట్టిన ఉపాధ్యాయుల సరెండర్ లీవులు మరియు ఇతర బకాయిలు ఎవరికీ చెల్లించబడలేదని కావున ప్రభుత్వం వెంటనే క్రిస్టమస్ పండగ సందర్భంగా ఆయన ఆ బకాయిలు చెల్లించేలా చర్యలు గై కొనాలని వారు ప్రభుత్వాన్ని కోరారు . అలాగే కొత్త పిఆర్సి కమిషన్ వెంటనే నియమించి ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తారని వారు ఆశిస్తున్నారు కావున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయంలో చర్య తీసుకుని ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు, ప్రభుత్వాలు మారిన ఉపాధ్యాయుల అగచాట్లు తప్పడం లేదని వంద రోజుల ప్రణాళిక పేరుతో ఉపాధ్యాయులకు ఆదివారం కూడా 8 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పాఠశాలకు వెళ్లి బోధన అభ్యసన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రణాళికలు ఇవ్వడం ఇబ్బందికరంగా ఉందని చాలామంది ఉపాధ్యాయులు వాపోతున్నారని వాళ్ళు తెలియచేశారు ఎస్ సి ఆర్ టి డైరెక్టర్ వారిచ్చిన 100 రోజుల ప్రణాళికలో సంక్రాంతి సెలవుల్లో కూడా పనిచేయాలని ఇవ్వడం చాలామందికి ఇబ్బందిగా ఉందని వారు తెలియజేశారు, సమీప గ్రామాల నుంచి ఉన్నత పాఠశాలలకు వస్తున్న బాలికలు సాయంత్రం 5 గంటల తర్వాత చీకటి పడుతుండటం వల్ల వారి గ్రామాలకు వెళ్ళేటప్పుడు అనుకోని దుష్ట సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున ఈ విషయమై విద్యాశాఖ మంత్రివర్యులు ఆలోచించాలని అప్టా సంఘం తరఫున వారు కోరారు.