26న కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కురవ సంఘం ఆధ్వర్యంలో 2023- 24 విద్యా సంవత్సరం గాను పదవ తరగతి, ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం లో అధిక మార్కులు సంపాదించిన కురువ విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నట్లు కర్నూలు జిల్లా కురువ సంఘం గౌరవ అధ్యక్షులు కే .కిష్టన్న , అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి పత్తికొండ శ్రీనివాసులు ,ఎం .కే .రంగస్వామి అసోసియేట్ అధ్యక్షుడు గుడిసె శివన్న ,కోశాధికారి కే .సి .నాగన్న , తెలిపారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని పెద్దపాడు రోడ్ లోని రాజీవ్ గృహకల్ప ఎదురుగా మోడల్ స్కూల్ పక్కన శ్రీశ్రీ బీరప్ప స్వామి దేవాలయం ఆవరణము లో ఆదివారము ప్రతిభా పురస్కార అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమం ఉదయం 10 గంటలకు జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా కర్నూలు, నంద్యాల జిల్లా కమిటీ సభ్యులు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ,సర్పంచులు, ఎంపీటీసీలు ,కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ,కురువ కార్పొరేషన్ డైరెక్టర్లు మరియు కురువ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లోఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు బి .వెంకటేశ్వర్లు ,ఉరుకుందు ,కత్తి శంకర్ ,నాయకులు తవుడు శ్రీనివాసులు ,బి .సి .తిరుపాలు ,నాగయ్య ,పెద్దపాడు ధనుంజయ ,పుల్లన్న ,హరిదాసు ,ఎల్లయ్య ,దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు .