జనవరి 5న కురువ వివాహ పరిచయ వేదిక
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కురువ సంఘం. కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఆవరణలోని మండల ప్రజాపరిషత్ సమావేశం భవనం లో జనవరి 5న ఆదివారం ఉదయం 10 గంటలకు కురువ, కురుబ, కురుమ కులస్థుల వివాహ పరిచయ వేదిక కరపత్రాన్ని కురువ సంఘం జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి, అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, కులస్థులు ఆవిష్కరించారుఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని కులజులు తమ అవివహిత పిల్లలకు పెళిళ్ళు చేసేందుకు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో జిల్లా మహిళా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, టీ. శ్రీలీల, కె. అనితా లక్ష్మి, తేజస్విని, సంఘం నాయకులు కె. సి. నాగన్న,బి. వెంకటేశ్వర్లు, కె.ధనుంజయ, బి. రామకృష్ణ,తవుడు శ్రీనివాసులు, బి. రామకృష్ణ కోత్తపల్లి దేవేంద్ర పాల సుంకన్న,బి. సి.తిరుపాల్, పుల్లన్న, దివాకర్, మద్దిలేటీ, కె. సోమన్న తదితరులు పాల్గొన్నారు.