గులాబీ రంగు పురుగుపై ఒకరోజు అవగాహన .. శిక్షణ కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఉద్యానభవన్ లో జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులకు , సహాయ వ్యవసాయ సంచాలకులకు, జిల్లా శిక్షణ కేంద్ర అధికారులకు మరియు ఆత్మ సిబ్బందికి పత్తి పంటను ఆశించు గులాబీ రంగు పురుగుపై ఒకరోజు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారిని శ్రీమతి.పి.ఎల్ వరలక్ష్మిమరియు కృషి విజ్ఞాన కేంద్రం యాగంటి పల్లి శాస్త్రవేత్త శ్రీ బాలరాజు హాజరవడం జరిగినది. యాగంటిపల్లి శాస్త్రవేత్త శ్రీ బాలరాజు గులాబీ రంగు పురుగు ఆశించకుండా తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు మరియు ఆశించిన తర్వాత తీసుకోవలసిన చర్యల గురించి దృశ్య రూపంలో వివరించడం జరిగినది. జిల్లా వ్యవసాయ అధికారిని శ్రీమతి పిఎల్ వరలక్ష్మి మాట్లాడుతూ మండల వ్యవసాయ అధికారులు గులాబీ రంగు పురుగు ఆశించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఆశించిన తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి రైతులకు అవగాహన కల్పించవలసినదిగా ఆదేశించడం అయినది తద్వారా రైతులు నాణ్యమైన ప్రతి ఉత్పత్తిని మరియు అధిక దిగుబడి పొందేలా ఇప్పుడు చేయాల్సినదిగా కోరడమైనది.