వ్యాదినిరోదక టీకాలపై వైద్యాదికారులకు ఒక రోజు శిక్షణా కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు మెడికల్ కళాశాల ఓల్డ్ లెక్చరర్ గ్యాలరీ నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి డాక్టర్.L.భాస్కర్ ఆద్వర్యంలో వ్యాదినిరోదక టీకాలపై ప్రాథమిక ఆరోగ్య మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాదికారులకు ఒక రోజు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ శిక్షణా కార్యక్రమం నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి డాక్టర్.L.భాస్కర్ మాట్లాడుతూ ప్రతి వైద్యాధికారి వారి పరిధిలో ప్రతి బుదవారం మరియు శనివారం వ్యాదినిరోదక టీకాల కార్యక్రమం కొరకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని అంతేకాకుండా గర్భవతులు మరియు పిల్లల జాభితాను తయారుచేసుకొని వారికి సమయాను సారంగా ఇవ్వవలసిన వ్యాదినిరోదక టీకాలను 100 % అందేటట్లు చూడాలని , ఆవివరాలను సంబందిత పోర్టల్ నందు అప్లోడ్ చేయాలని వారు తెలిపారు. డాక్టర్ వరుణ్ ధర్మన్ సర్వేలెన్సు మెడికల్ ఆఫీసర్(W.H.O) గారు మాట్లాడుతూ గర్భవతులు మరియు పిల్లలకు టీకాల అనంతరం ఏవేని ప్రతికూల సంఘటనలు (Adverse Effects) జరిగినప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టాలి , మరియు వ్యాదినిరోదక టీకాల కార్యక్రమం నకు సంబంధించి నిర్వహించవలసిన రిపోర్ట్లు మరియు రికార్డ్ ల గురించి పవర్ పాయింట్ ద్వారా వివరించారు.ఈ కార్యకమములో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ నాగప్రసాద్ బాబు , PO RBSK హేమలత , DPMO డాక్టర్ ఉమా గారు , జిల్లా మలేరియా అధికారి నూకరాజు , డెమో శ్రీనివాసులు , ప్రాథమిక ఆరోగ్య మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాదికారులు తదితరులు పాల్గొన్నారు.