పాఠశాల యాజమాన్య కమిటీల విధులు బాధ్యతలపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: స్థానిక గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో గురువారం మండల స్థాయిలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ లకు మరియు ప్రధానోపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు విధులు, బాధ్యతలు, బాలల హక్కులు పరిరక్షణ, పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాల నిర్వహణ విధివిధానాలు, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక పాఠశాల సామాజిక తనిఖీ పాఠశాల అభివృద్ధి ప్రజల భాగస్వామ్యం (చేయి చేయి కలుపుదాం బడిన అభివృద్ధి చేద్దాం)సమకాలీన సమస్యలు పరిష్కారాలు అనే అంశాలపై రిసోర్స్ పర్సన్స్ శిక్షణ ఇచ్చారు. వీటిని పాఠశాల స్థాయిలో పేరెంట్ కమిటీలకు సమావేశం నిర్వహించి పాఠశాల స్థాయిలో కూడా శిక్షణ ఇవ్వవలెనని పత్తికొండ మండల విద్యాశాఖ అధికారి-2 శ్రీ రమేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాలల పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లు ప్రధానోపాధ్యాయులు, అలాగే ఈ శిక్షణ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ గా జయరాముడు, నాగభూషణం, నాగేశ్వరావు పాల్గొని పై అంశాలపై శిక్షణ ఇచ్చారు.