రిడ్జ్ పాఠశాలలో కొనసాగుతున్న సిబిఎస్ఇ ఫుట్బాల్ పోటీలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక లక్ష్మీపురంలోని క్రిడ్జ్ పాఠశాలలో సీబీఎస్ఈ క్లస్టర్ సెవెన్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల బాలుర ఫుట్బాల్ పోటీలు నిన్న అట్టహాసంగా ప్రారంభమై రెండవ రోజు కూడా నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఈ పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులు నువ్వా నేనా అన్నట్లుగా ప్రత్యర్థులతో తలపడుతూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. ఈరోజు నిర్వహించిన పోటీలలో అండర్ 14 విభాగంలో ఎడిఫై వరల్డ్ స్కూల్ అత్తాపూర్ హైదరాబాద్, శ్లోక ఏ బిర్లా స్కూల్ నల్గొండ జిల్లా, శ్యామ్ రాజ్ స్కూల్ కృష్ణాజిల్లా, జట్లు విజయం సాధించగా….. అండర్ 17 విభాగంలో రెయిన్బో స్కూల్ నెల్లూరు, శ్రీ స్వామి నారాయణ గురుకుల్ విద్యాలయ హైదరాబాద్, మాంటిసోరి స్కూల్ కర్నూల్ జట్లు విజయం సాధించగా… అండర్ 19 విభాగంలో కాకతీయ పబ్లిక్ స్కూల్ విశాఖపట్నం, ఇండస్ యూనివర్సల్ స్కూల్ రంగారెడ్డి జిల్లా, చిన్మయ విద్యాలయ హైదరాబాద్ జట్లు విజయం సాధించి తదుపరి పోటీలకు అర్హత సాధించాయని పాఠశాల సీఈవో గోపినాథ్ తెలియజేశారు. ఈరోజు పోటీలు ఫుట్బాల్ టోర్నమెంట్ కార్యదర్శి డీన్ రాజేంద్రన్, ప్రిన్సిపల్ రాజకమల్, గ్లోబల్ స్కూల్ సీఈవో వంశీధర్ ల ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నాయి. రేపు జరగబోయే అండర్ 19 క్వార్టర్ ఫైనల్స్ పోటీలను రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ ప్రారంభించనున్నారు.