స్థానిక జెడ్పి హైస్కూల్ ఆవరణంలో ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : హోళగుంద మండలం స్థానిక ZP హైస్కూల్ ఆవరణం నందు హోళగుంద యువత ఆద్వర్యంలో హోళగుంద ప్రీమియం లీగ్ (HPL)ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.మొదటి ప్రారంభం కార్యక్రమాన్ని అతిథులుగా పాఠశాల ఛైర్మెన్ ద్వారకనాథ్ ఆచారి, వైస్ ఛైర్మన్, జిల్లా యువ నాయకులు,మండల సీనియర్ నాయకులు మరియు మండల యువ నాయకులను ఆహ్వానించి యువకుల చేతులమీదుగా క్రికెట్ ఆటను హోళగుంద వారియర్స్ V/s హోళగుంద11 జట్టులతో మొదటి ఆటను 10 ఓవర్లతో ఆరంభిచడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యువకులు నాయకులు మాట్లాడుతూ మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రికెట్ ఆట పోటీల్లో అందరూ సోదరభావంతో ఆడాలనీ ఎవరు గెలిచిన ఎవరు ఓడిన అందరూ సమానంగా ఐక్య మత్యంతో ఉండి రాష్ట్ర స్థాయిలో కూడా మన హోళగుంద మండలం యువకులు క్రికెట్ ఆటలో పోటీ పడి ఉన్నతస్థాయికి మండలానికి మంచి పేరును తీసుకుని రావాలనీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిబిఎన్ ఆర్మీ ముల్ల మోయిన్, ఎండి హళ్లి సర్పంచ్ జీకే సుధాకర్, ఎల్లార్తి అర్జున్, సీతయ్య, తదితరులు పాల్గొన్నారు.