PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కడపలో కొత్త డీలర్‌షిప్ ప్రారంభించిన మహీంద్రా ట్రక్స్ అండ్ బస్

1 min read

ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో నవత ఆటోమోటివ్స్‌ పేరిట కొత్త డీలర్‌షిప్ ప్రారంభం.

పల్లెవెలుగు వెబ్  కడప : సీఏజీఆర్ ప్రాతిపదికన 2024 ఆర్థిక సంవత్సరంలో 46 శాతం వ్యాపార పరిమాణం పెరుగుదలతో నాలుగేళ్ల పటిష్ట వృద్ధి సాధించిన మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ (ఎంటీబీడీ) ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో నవత ఆటోమోటివ్స్ పేరిట కొత్తగా అధునాతన డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. ఇది 87,000 చ.అ. విస్తీర్ణంలో మొత్తం 8 ‘వెహికల్ సర్వీస్ బే’లతో ఏర్పాటైంది. ఇందులో డ్రైవర్ లాడ్జింగ్, 24 – గంటల బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్, యాడ్‌బ్లూ లభ్యత ఉంటుంది. “భారతీయ సీవీ మార్కెట్లో ఎంటీబీడీకి పటిష్టమైన కార్యకలాపాలు ఉన్నాయి. సంస్థ ఇప్పటికే పలు రంగాలు, మార్కెట్లలో 3వ స్థానంలో ఉంది. మా నెట్‌వర్క్‌కు కొత్తగా ఈ 5 డీలర్‌షిప్‌లు తోడు కావడమనేది మా నెట్‌వర్క్‌ను మరింత పెంచగలదని, మా కస్టమర్ల వాహనాల సర్వీసింగ్‌కు, మరియు వారు తమ ఫ్లీట్‌లను మరింత సమర్ధంగా పనిచేయడంలో తోడ్పాటు అందించేందుకు ఉపయోగపడగలవని విశ్వసిస్తున్నాం. రాబోయే రోజుల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంపై మరింత ఉత్సాహంగా ఉన్నాం. మా విలువైన కస్టమర్లకు వినూత్నమైన, సమర్ధమంతమైన రవాణా సొల్యూషన్స్‌ను అందించడంపై మరింతగా దృష్టి పెడుతున్నాం” అని మహీంద్రా & మహీంద్రా బిజినెస్ హెడ్ (కమర్షియల్ వెహికల్స్) శ్రీ జలజ్ గుప్తా తెలిపారు. బీఎస్6 ఓబీడీ II శ్రేణి ట్రక్కులకు సంబంధించి రవాణాదారుల లాభదాయకతను మరింత పెంచేందుకు తోడ్పడే హామీనిచ్చే “జ్యాదా మైలేజ్ నహీ తో ట్రక్ వాపస్” పేరిట కొత్త మైలేజ్ గ్యారంటీని ఆవిష్కరించిన సందర్భంగా తమ వాహనాల అత్యుత్తమ సాంకేతిక సామర్ధ్యాలను గుప్తా వివరించారు. పటిష్టమైన డీలర్ భాగస్వాములకు తోడు అధునాతన 3S యూనిట్లు, కస్టమర్ సర్వీస్‌లో కొత్త ప్రమాణాలు నెలకొల్పేందుకు, ఎంటీబీ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు తోడ్పడగలవని ఆయన తెలిపారు.

About Author