నగరంలో బిగ్ గయ్స్ వింగ్స్ అండ్ మోర్ రెస్టారెంట్ ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: నగరంలో మొట్ట మొదటి బిగ్ గయ్స్ వింగ్స్ అండ్ మోర్ రెస్టారెంట్ ను ఆ సంస్థ సీఈఓ బిరాజ రౌత్ లాంఛనంగా ప్రారంభించారు.శుక్రవారం గురునానక్ కాలనీలో నూతనంగా బిగ్ గయ్స్ వింగ్స్ అండ్ మోర్ రెస్టారెంట్ నూతనంగా ఏర్పాటు చేశారు. నవీన్ బాబు గోరంట్ల, బండ్ల నిరంజన్ బాబు, విన్నకోట రాజ్ కుమార్ ఈ ముగ్గురు సంయుక్తంగా కలిసి ఈ రెస్టారెంట్ ను లాంఛనంగా ప్రారంభించారు. బిగ్ గయ్స్ సంస్థ సీఈవో బిరాజ రౌత్ లాంఛనంగా ప్రారంభించి డైరెక్టర్లను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విజయవాడ నగరంలో బిగ్ గయ్స్ వింగ్స్ అండ్ మోర్ రెస్టారెంట్ ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పలు రాష్ట్రాలలో తమకు శాఖలు ఉన్నాయని ఆంధ్ర రాష్ట్రంలో కూడా తమ శాఖలను విస్తరించాలని ఉద్దేశంతో విజయవాడ నగరం నుంచి తమ వ్యాపార లావాదేవీలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రానున్న రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో 25 శాఖలు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు ఆయన వివరించారు. అనంతరం బిగ్ గయ్స్ డైరెక్టర్లు నవీన్ బాబు గోరంట్ల, బండ్ల నిరంజన్ బాబు , విన్నకోట రాజ్ కుమార్ లు మాట్లాడుతూ విజయవాడ నగరవాసులకు చవులూరించే రుచికరమైన చికెన్ ఫ్రైడ్ వంటకాలను తమ రెస్టారెంట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. చికెన్ అంటే ఇష్టం లేనివారు ఉండరని ముఖ్యంగా యువత కోసం ఫ్రైడ్ చికెన్, రామన్ ప్రైడ్ చికెన్, చికెన్ వింగ్స్ గ్రిల్ చికెన్ వర్కర్స్ తమ వద్ద లభిస్తాయని వారు వివరించారు. తమ వద్ద నాలుగు లెవెల్స్ లో ఫ్రైడ్ చికెన్ అందుబాటులో ఉంటుందని పేరి పేరి, గన్ పౌడర్ ,కించి, చిల్లి తడ్క చికెన్ ఐటమ్స్ ఒక్కసారి ఆరగిస్తే మరచిపోలేని అనుభూతిని పొందుతారని పేర్కొన్నారు. విజయవాడ నగర ప్రజలు తమ రెస్టారెంట్స్ కు విచ్చేసి చికెన్ వెరైటీ వంటకాలను రుచి చూసి తమను ఆదరించాలని వారు కోరారు.