90 సంవత్సరాల నైపుణ్యంతో విజయవాడలో సావి గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ : బంగారు వజ్రాభరణ రంగంలో తనదైన ముద్ర వేసిన సావి గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూం విజయవాడ నగరంలో ప్రారంభమైంది..90 సంవత్సరాల అపరిమిత నైపుణ్యాన్ని ప్రాతిపదికగా తీసుకొని, సావి గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడలో లగ్జరీతో అందానికి కొత్త నిర్వచనాన్ని అందిస్తోందనీ సావి గోల్డ్ అండ్ డైమండ్స్ వ్యవస్థాపకులు… అన్నారు. కావున నగరవాసులు తమ నూతన షో రూమ్ ను సందర్శించాలని వారు కోరారు విజయవాడ బందర్ రోడ్ లో 90 సంవత్సరాల అపరిమిత నైపుణ్యం గల సావి గోల్డె అండ్ డైమండ్స్ నూతన షోరూం ను స్థాపకులు ప్రవీణ కుమార్, సుశీల్ కుమార్, సంజయ్ కుమార్, రుణిక్ జైన్, సూరజ్ జైన్, విటిన్ జైన్, ధీరెన్ జైన్, మరియు మెహుల్ జైన్ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ఎంజీ రోడ్డులో గల ఈ ప్రీమియం జువెలరీ స్టోర్, వారసత్వం, నైపుణ్యం, మరియు ఆధునిక సౌకర్యాలను సమ్మిళితమైన ఒక అసాధారణ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందన్నారు.విశాలమైన స్థలంతో విజయవాడలోనే అత్యంత పెద్ద ఆభరణాల స్టోర్ గా పేరు పొందిన సావి గోల్డ్ అండ్ డైమండ్స్, బంగారం, వజ్రాలు, మరియు పోల్కీ ఆభరణాల విస్తృతమైన శ్రేణిని అందిస్తోందన్నారు. సమకాలీన డిజైన్లు మరియు శాశ్వత క్లాసిక్స్తో, నేటి ఆధునిక కస్టమర్ల సుకుమారమైన అభిరుచులను తీర్చడంలో సావి విశిష్టతను ప్రదర్శిస్తుందన్నారు..సావి ప్రత్యేకతను మరింతగా పెంచుతూ, వదువుల కోసం ఒక ప్రత్యేక అంతస్తును అందిస్తుంది. ఈ లగ్జరీ ప్రైవేట్ స్పేస్ వదువులు తమ కలల ఆభరణాలను ఆవిష్కరించుకునే అనుభూతిని పొందవచ్చునని తెలిపారు. ప్రత్యేక ఆభరణాల తయారీ నుండి వారసత్వ ఆభరణాలను పునరుద్దరించే సేవల వరకు, వదువు అంతస్తు ప్రతి క్షణాన్ని మరపురాని అనుభవంగా మార్చుతుందన్నారు.