ఆపస్ డైరీ ఆవిష్కరించిన ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్ ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం 2025 డైరీ ని ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్థానిక మాగుంట కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ప్రభుత్వం విద్యలో విప్లవాత్మక మార్పులు తేవడానికి ప్రయత్నం చేస్తుందని దానికి ఉపాధ్యాయులంతా సహకరించాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే దానిని పరిష్కరించడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపస్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి సిహెచ్ శ్రావణ్ కుమార్ , జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కమ్మ మల్లికార్జున్ రావు, టి దిలీప్ చక్రవర్తి ,vజిల్లా బాధ్యులు బి గుణ ప్రసాద్,, వి.చంద్రశేఖర్, కె.నరసింహారావు, కె.వి శేషారావు తదితరులు పాల్గొన్నారు.