PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆపస్ నల్ల బ్యాడ్జీలతో నిరసన

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ సూచనల మేరకు ఈరోజు మధ్యాహ్నం విరామ సమయంలో పాఠశాలల్లో నిరసన వ్యక్తం చేయడము జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘటన కార్యదర్శి సిహెచ్ శ్రావణ్ కుమార్, ప్రకాశం జిల్లా అధ్యక్షులు కె .మల్లికార్జునరావు  టి. దిలీప్ చక్రవర్తి  తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంతవరకు ఉపాధ్యాయ సంఘాలతో సమావేసాన్ని ఏర్పాటు చేసి  విద్యాశాఖలో ఉన్నటువంటి సమస్యలు గురించి చర్చించకపోవడం బాధాకరమని, గత  ప్రభుత్వం తీసుకొచ్చి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసినటు వంటి జీవో నెంబర్ 117 మరియు 128 ద్వారా పాఠశాలలలో  వర్క్ అడ్జస్ట్మెంట్లు జరపడం ఉపాధ్యాయులను మిగులుగా చూపించడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ప్రభుత్వానికి అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఇంతవరకు ఉపాధ్యాయ సంఘాల సమావేశం ఏర్పాటు చేయక పొగా దీనివల్ల విద్యా శాఖలో జరుగుతున్న నష్టం సమస్యలు ప్రభుత్వము ఆలోచించకపోవడం శోచనీయమని, విద్యా వ్యవస్థలో మరిన్ని సమస్యలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని కావున తక్షణం జీవో నెంబర్ 117 ను రద్దుచేసి విలీనం చేసినటువంటి తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలకు అప్పగించాలని, పదోన్నతులు నిర్వహించి, ఖాళీ అయినటువంటి పోస్టులకు విద్యా వాలంటీర్లను నియమించి తిరిగి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి బలోపేతం చేయాలని, దీనికి సంబంధించి ఉపాధ్యాయ సంఘాల నుంచి తగిన సలహాలు, సూచనలను  ప్రభుత్వం స్వీకరించాలని, అప్పటివరకు వర్క్ అడ్జస్ట్మెంట్లను వాయిదా వేసి త్వరితగతిన చర్చలకు పిలిపించాలని, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ప్రకాశం జిల్లా శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

About Author