వెల్దుర్తి మండలం లో ఆప్టా విస్తృత సభ్యత్వ నమోదు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: నేడు ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) సంఘం సభ్యత్వ నమోదు వెల్దుర్తి మండలం లో ఆప్టా రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ అయిన మునగాల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వెల్దుర్తి మండలం లోనీ నాగలాపురం, అలుగుండు, వెల్దుర్తి లోని మెయిన్ స్కూల్, రామళ్లకోట వివిధ పాఠశాలలో ఉపాధ్యాయుల ను సభ్యులు గా చెయడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఆప్టా జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సేవా లాల్ నాయక్,కోశాధికారి వినోద్ కుమార్ , మహబూబ్ బాషా , కోమరి కులై పాల్గొనడం జరిగింది.మండలము లోని ఉపాధ్యాయులు తమ యొక్క సమస్య లను ఆప్టా బృందానికి వివరించడం జరిగింది. వారు సమస్యల పరిష్కారం కొరకు సత్వరం కృషి చేస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది.