ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకం
1 min read-ఈనెల 20వ తేదీ లోపల హార్టికల్చర్ కు దరఖాస్తు చేసుకోవాలి
– ఏ పి ఓ. బి.శైలజా
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ఉపాధి హామీ ద్వారా నూరు శాతం సబ్సిడీతో పండ్లతోటల పెంపకం చేపట్టవచ్చు అని చెన్నూరు మండలం ఉపాధి హామీ పథకం ఏపీవో బి శైలజా పేర్కొన్నారు. చెన్నూరులో ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూఈ నెల 20 వ తేదీ వరకు హార్టికల్చర్ కు ధరఖాస్తు చేసుకోచ్చు అని తెలియజేశారు.3. 5 ఎకరాలు లేదా అంతకంటే తక్కువ భూమి కలిగిన చిన్న,సన్నకారు రైతులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో గలరని ఆమె తెలిపారు. మామిడి, చీనీ, సన్న నిమ్మ, జామ, సపోట, కొబ్బరి, సీతాఫలం, దానిమ్మ, నేరేడు, ఆపిల్ బేర్, డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్ల తోటలు నాటుకొంటే 3 సంవత్సరాల పాటు ప్రభుత్వం ద్వారా నూరు శాతంఉచితంగా నిర్వహణా చార్జీలు చెల్లించడం జరుగుతుంది అన్నారు. రోజా మరియు మల్లె తోటలు నాటుకొన్న రైతులకు రెండు సంవత్సరాల నిర్వహణా చార్జీలు.మునగ తోటలు నాటుకొనే రైతులకు 2 సంవత్సరాల నిర్వహణా చార్జీలు అదే విదంగా నర్సరీలు ఏర్పాటు చేసుకొని మొక్కను పెంచి ఉపాధి హామీలో నాటుకొనే రైతులకు సరఫరా చేసినట్లైతె వారికి 3 నెలల పాటు మొక్కలు పెంచిన చార్జీలు ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నారు,కావున అర్హత, ఆసక్తి గల రైతులకు మండల ఉపాధి హామీ కార్యాలయంలో ఈ క్రింది పత్రాలతో మండల ఉపాధి హామీ ఏపీవో ను లేదా గ్రామ స్థాయిలో క్షేత్ర సహాయకుడు ఎఫ్ ఎసాంకేతిక సహాయకుడు టి ఏ ని సంప్రదించాలని కోరారు,ఉపాధి జాబ్ కార్ద్, భూమి పట్టాదారు పాసుపుస్తకం నకలు, వన్ బి, సన్నా ,చిన్నకారు రైతు పత్రం జాబ్ కార్డ్ లో ఉన్నవారి ఆధార్ కార్డ్ జిరాక్స్ కాఫీలు అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని చెన్నూరు మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.