PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అవయవ దానంపై అవగాహన సదస్సు

1 min read

అవయవదానంపై సమాజాన్ని చైతన్య పరిచేందుకు యువత నడుం బిగించాలి…..

జిల్లా రెవెన్యూ అధికారిణి శ్రీమతి పద్మజ

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:        ఆగస్టు 3 జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల ఆధ్వర్యంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శైలజ పర్యవేక్షణలో ఏర్పాటుచేసిన అవయవదానంపై అవగాహన సదస్సు మరియు అవయవదానంపై అంగీకార పత్రాల సేకరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  జిల్లా రెవెన్యూ అధికారిణి శ్రీమతి పద్మజ గారు హాజరవ్వగా, జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్.జఫ్రూల్లా, సీనియర్ వైద్యులు మాజీ ఐఎంఏ నాయకులు డాక్టర్ గేలివి సహదేవుడు, IMA నంద్యాల అధ్యక్షురాలు డా.వసూద, యోగ మాస్టర్ ఆనంద్ గురూజీ, కళాశాల NSS ఆఫీసర్ డా.రామలింగ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిఆర్ఓ పద్మజ మాట్లాడుతూ యువత సామాజిక దృక్పథం కలిగి ఉండాలని అవయవ దానం పై సమాజాన్ని చైతన్యపరిచేందుకు కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.     వైద్యులు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ జఫరుల్లా, డాక్టర్ వసుధ  మాట్లాడుతూ నేత్రదానం చేయడం వల్ల ఇద్దరికీ చూపు వస్తుందని అలాగే అవయవ దానం ద్వారా 8 మందికి కొత్త జీవితాలను ప్రసాదించవచ్చని, ఇటీవలి కాలంలో అవయవదానంతో పాటుగా టిష్యూ అనగా కణజాలం కూడా అవసరమైన వారికి దానం చేసి ఆదుకుంటున్నారని కావున ప్రతి ఒక్కరు కూడా తమ బంధువులలో తమ గ్రామాలలో సాధారణంగా చనిపోయినప్పుడు నేత్రదానానికి ప్రోత్సహించాలని, అలాగే బ్రెయిన్ డెడ్ అయిన వారి నుండి మాత్రమే అవయవాలను సేకరించగలమని తెలిపారు 2014 నుండి గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినప్పటి నుండి మన దేశంలో అవయ దాన అవగాహన దినోత్సవాన్ని జరుపుతున్నారని తెలిపారు. ఆనంద్ గురూజీ మాట్లాడుతూ మన పురాణాలలో కూడా అవధానం గురించి స్పష్టంగా ఉన్నదని, భవిష్యత్తులో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆయుష్ యోగ సేవా సమితి సంయుక్తంగా నేత్రదానంపై గ్రామ గ్రామానికి వెళ్లి అవగాహన కల్పిస్తామని ప్రతి ఒక్కరిలో చైతన్యం కలుగ చేస్తామని తెలియజేశారు.  రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి పర్ల మాట్లాడుతూ అవయదానంపై చైతన్యపరచ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలలో ఏర్పాటు చేస్తామని ఎవరైనా స్వచ్ఛందంగా నంద్యాల జిల్లాలో నేత్రదానం గాని అవయవదానం గాని చేయదలచిన వారు రెడ్ క్రాస్ సంస్థను సంప్రదించవలనని తెలియజేశారు.

About Author