భిన్నత్వంలో ఏకత్వంగా మన భారతదేశం
1 min readఅన్ని మతాల సారాంశం ఒక్కటే పొరుగు వారిని ప్రేమించి ఉన్న దానిలో సహాయపడటం
అందరూ సంతోషంగా బాగుండాలి అందులో నేనుండాలి
నూర్ భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి
షేక్ సయ్యద్ బాజీ (గాజుల బాజీ)
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : భిన్నత్వంలో ఏకత్వంగా మన భారతదేశం ప్రపంచ దేశాలలో గొప్పగా చెప్పుకోదగ్గ విషయం. సర్వ మతాలను, ఆచారాలను గౌరవిస్తూ కులమత రహితoగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్నదమ్ముల కలిసిమెలిసి ఉంటారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని నూరు భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ సయ్యద్ బాజీ (గాజుల బాజీ) మంగళవారం జర్నలిస్టు సోదరులకు తెలుగులో ప్రచురింపబడిన ఖురాన్ గ్రంధాన్ని సుమారు 50 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటామమన్నారు. ఏ దేవుడు సిద్ధాంతమైనా బోధనలైన పొరుగు వారిని ప్రేమించటంతో పాటు ఇతరులకు సహాయ పడాలని వారి బోధనలతో సూచించారన్నారు. ఒకరినొకరు అన్యోన్యంగా కలసి మెలసి ఉండాలన్నారు. తనకున్న దానిలో కొంత ఇతరులకు సహాయపడుతూ మానవసేవే మాధవ సేవగా భావించాలి అన్నారు. భాయి భాయి అంటూ సంతోషంగా ఐకమత్యంగా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అన్నారు. రాబోయే సంవత్సరం ఈ పండుగను మరింతగా ఆనందగా ఉత్సాహంగా మనమంతా కలిసి జరుపుకుందాం అన్నారు. కార్యక్రమంలో నాయకులు షేక్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు.