మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం
1 min readడొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభం
కాలేజీ ప్రధాన రహదారి మరమ్మతులు మరియు కాంపౌండ్ ను కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం
కాలేజీ సమస్యలు తన దృష్టికి తేవాలి
టీడీపీ ఇంచార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాది ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటూ విద్యార్థుల ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. విద్యార్థులకు రుచికరమైన ఆరోగ్యకరమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు అందించడమే ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకలి తీర్చే అన్నపూర్ణమ్మ మహాతల్లి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం చాలా ఆనందకరమని అన్నారు. కాలేజీకు ప్రధాన సమస్య అయినా రహదారి మరమ్మతులు అలాగే కాలేజీకి కాంపౌండ్ కూడా కట్టించే భాద్యత మాది హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న, బీజేపీ ఇంచార్జ్ ఎన్. విష్ణువర్ధన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ రమేష్, సిఐ రామాంజులు, ఎస్ఐ పరమేష్ నాయక్, యంఈఓ లు మొయినుద్దీన్, రాఘన్న, లెక్చరర్లు, మంత్రాలయం మండల టిడిపి నాయకులు అశోక్ రెడ్డి వరదరాజులు ,ఎంపిటిసి సభ్యులు మేకల వెంకటేష్, బూత్ ఇంచార్జి మేకల నర్సింహ, డీసీసీ తిమ్మప్ప, తెర్నకల్ రఘు, డేవిడ్, శివ, గుడిసే రాజన్న, రచ్చమరి టిడిపి నాయకులు పోలి శివ, పోలీ వీరేష్, భీంరెడ్డి, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.