ఏపీ ముఖ్యమంత్రి ని కలిసిన ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈ సందర్భంగా మంగళవారం రోజున అమరావతి సెక్రటేరియట్ (CMO) క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌ!!.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు సార్ గారి దృష్టికి హోళగుంద మండల వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యల (మరియు) ఎస్సీ హాస్టల్ ను పునః ప్రారంభించాలి. 88 లక్షలతో నిర్మించిన భవనం ఎస్సీ హాస్టల్ ను విద్యార్థులకు అనుగుణంగా పునః ప్రారంభించాలి.(మరియు) మండల వ్యాప్తంగా మండల ప్రాథమిక పాఠశాలలో నెలకొన్న ఉపాధ్యాయుల కొరత మండల ప్రాథమిక పాఠశాలలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య 162 మంది ఉపాధ్యాయులు కావలసిన మండలానికి కేవలం 82 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు మనకు కావాల్సిన మరో 80 మంది ఉపాధ్యాయులను నియమించాలి. కోరుతూ అసలు ఉపాధ్యాయులు లేని పాఠశాలలు పెద్దహ్యాట ఇంగలదాహాల్ ఉర్దూ నాగరకన్వీ కొత్తపేట పాఠశాలలు ఉండగా ఏకోఉపాధ్యాయ పాఠశాలలు నెరనికి తాండ ఎల్లార్తి ఉర్దూ మరియు కన్నడ ముద్దటమాగి హొన్నూరు పాఠశాలలు ఉన్నాయి. (మరియు) కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన 49 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ (KGBV) ప్రకటనలో భాగంగా మా హోళగుంద మండలానికి మరో అదనపు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) మంజూరు చేయాలని (మరియు) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌ!! శ్రీ.నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి 04 పేజీల విద్యారంగా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.