డేటా కాంప్లెక్స్ లో పద్మభూషణ్ కెఎల్ రావు 122వ జయంతి వేడుకలు
1 min readఇరిగేషన్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం
ఘన నివాళులర్పించిన ఇంజనీర్లు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్ లో పద్మభూషణ్ డాక్టర్ కె ఎల్ రావు 122 వ జయంతి కార్యక్రమాన్ని ఇరిగేషన్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా కె ఎల్ రావు కు ఘన నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా గా ఏలూరు ఇరిగేషన్ సర్కిల్ ఎస్ ఇ దేవ ప్రకాష్ హాజరై పుష్ప మాలలు వేసి ..కె ఎల్ రావు ప్రముఖ ఇంజినీర్ గా ప్రసిద్ధ చెంది దేశంలో ఉన్న అనేక కట్టడాలకు స్ఫూర్తి గా నిలిచారని,, వారి ఆదర్శ ఆశయాలను ఇంజినీర్లు పుణికి పుచ్చుకుని అభివృద్ధి కి పునరంకింతం కావలసిన అవసరం ఉందని తెలిపారు. చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ పులిచింతల ప్రాజెక్టు కు కె.ఎల్ రావు పేరు ని పెట్టారని గుర్తు చేశారు. ఇంజినీర్లు యేటి అర్జున్, బొట్టా శ్రీనివాస్,దేవరకొండ వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.