17న పద్మశాలియుల కార్తీక వనభోజనం
1 min readకర్నూలు, పల్లెవెలుగు: పవిత్ర కార్తీక మాసంలో అత్యంత వైభవంగా నిర్వహించే కార్తీక వనభోజన మహోత్సవాన్ని ఈ నెల 17న ( ఆదివారం) పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కస్తూరి వేమయ్య, ప్రధాన కార్యదర్శి మేడం సుంకన్న, కోశాధికారి గుర్రం శివ ప్రసాద్ , సభ్యుడు జెరుబండి హరి ప్రసాద్ తెలిపారు. నగరంలోని శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి దేవాలయం ఆవరణలో సంఘం పెద్దలు వన భోజన మహోత్సవానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కస్తూరి వేమయ్య మాట్లాడుతూ పద్మశాలి సంఘం మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం సుంకేసుల రోడ్డులోని ఎస్ ఎల్.ఎన్. గార్డెన్స్ లో 16వ కార్తీక వన భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కుల బాంధువులు, పెద్దలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షుడు కస్తూరి వేమయ్య వెల్లడించారు. ఉదయం 8.30 గంటలకు శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి ఉత్సవ విగ్రహములకు మరియు ఉసిరిక చెట్టు పూజ తో కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.