‘ పద్మశాలీలు’ రాజకీయంగా రాణించాలి
1 min readమాజీ ఎంపీ డా. సంజీవ్ కుమార్
- సంఘం సేవకులకు, సివిల్ సప్లై రాష్ట్ర డైరెక్టర్ కొంకతి లక్ష్మినారాయణ ఘన సన్మానం
కర్నూలు, పల్లెవెలుగు:పద్మశాలీలు రాజకీయంగా.. సామాజికంగా.. ఆర్థికంగా రాణించాలని పిలుపునిచ్చారు మాజీ ఎంపీ డా. సంజీవ్ కుమార్. ఆదివారం పద్మశాలీ సంఘం 16వ కార్తీక వన భోజన మహోత్సవాన్ని సంఘం జిల్లా అధ్యక్షుడు కస్తూరి వేమయ్య, ప్రధాన కార్యదర్శి మేడం సుంకన్న, కోశాధికారి గుర్రం శివ ప్రసాద్ , సభ్యుడు జెరుబండి హరి ప్రసాద్ నేతృత్వంలో జరిగింది. కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా డా. సంజీవ్ కుమార్, సివిల్ సప్లై రాష్ట్ర డైరెక్టర్ కొంకతి లక్ష్మినారాయణ తదితరులు విచ్చేశారు. ముందుగా ఉసిరి చెట్టుకు పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తరువాత జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు కస్తూరి వేమయ్య మాట్లాడుతూ సమాజానికి ఎంతో మేలు చేసే పద్మశాలీలు… ఐక్యతగా ఉంటూ సత్తా చాటాలన్నారు. పద్మశాలీలు యువత సేవా చేసే గుణం అలవర్చుకోవాలని సూచించారు.ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
సేవకులకు..ఘన సన్మానం
పద్మశాలీల సంఘానికి ఎనలేని సేవ చేసి…అందరి మన్ననలు పొందిన సేవకులకు పద్మశాలీ సంఘం తరుపున ఘనంగా సన్మానించారు. కొన్నేళ్లుగా సంఘానికి సేవ చేసిన డా. అచ్చుత్ రావు, డా. సేపూరి కృష్ణ మోహన్ , డా.మురళీ కృష్ణ, డా. సేపూరి రవితేజ, డా. రవీంద్ర దీపక్, డా. మందా నాగేశ్వర రావు, డా. పి.వి. నాగరాజు, డా. జింకా రామాంజనేయులు, డా. జానకి రాం, డా. మాకం సాయి గాయత్రి , డా. గోరంట సుమస్తి,డా. కీర్తన, కస్తూరి పెద్ద రంగ స్వామి, గంజి శివరామలింగయ్య, పొబ్బతి గోవింద రాజులు, వగ్గా రామాంజనేయులు, జేరు బండి హరి ప్రసాద్, నారాయణ గారి ఆంజనేయులు, శిరసాల రామచంద్రుడు, గోరంట విజయలక్ష్మి, శిలరాల లక్ష్మినారాయణ, తిరువీధుల వెంకటేశ్వర్లు, వాసి సుబ్బ రాయుడు, డా. పేట్ల రామకృష్ణ, కాల్వ కమలాకర్, శిరసాల ఆంజనేయులు ను మాజీ ఎంపీ డా. సంజీవ్ కుమార్, సంఘం అధ్యక్షుడు కస్తూరి వేమయ్య తదితరులు ఘనంగా సన్మానించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది.