PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పైసాలో డిజిటల్ లిమిటెడ్‌ 75 మిలియన్ డాలర్ల వరకు ఫండ్ రైజ్ ఆమోదం

1 min read

పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : పైనాన్‌షియల్ రంగంలో స్థిరంగా ఎదుగుతున్న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన పైసాలో డిజిటల్ లిమిటెడ్ (బిఎస్ఇ: 532900, ఎన్ఎస్ఇ: పైసాలో) బోర్డు 7.5% సెక్యూర్డ్ ఫారిన్ కరెన్సీ కన్వర్టిబుల్ బాండ్స్ (ఎఫ్ సిసిబిఎస్) ద్వారా 75 మిలియన్ డాలర్ల వరకు నిధులను సేకరించడానికి ఆమోదం తెలిపింది. ఈ బాండ్లు 5 ఏళ్ల గడువు కలిగి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ధేశించిన ఇసిబి మార్గదర్శకాలను అనుసరించనున్నాయి.

ఆర్థిక ఫలితాలు:

సెప్టెంబర్ 30, 2024 తో ముగిసిన త్రైమాసిక, అర్ధవార్షిక ఆర్థిక ఫలితాల ప్రకారం, కంపెనీ రూ. 45,352 Mn ఆస్తుల నిర్వహణ (ఏయుఎం)తో 19% వృద్ధి సాధించింది. రెవెన్యూ 33%  వృద్ధితో Rs. 3,736 ఎంఎన్ కి చేరుకుంది. నికర లాభం 6% వృద్ధితో Rs. 914 ఎంఎన్గా నమోదైంది.

వృద్ధి లక్ష్యాలు:

కంపెనీ వ్యయాలను తగ్గిస్తూ, జెన్ఏఐ సాంకేతికతను అన్వయించుకొని, ఉత్పాదకతను పెంచడంపై దృష్టి పెడుతోంది. జిఎన్ పిఏ, ఎన్ఎన్ పిఏలు వరుసగా 0.86% మరియు 0.61%*గా ఉండగా, దీర్ఘకాలంలో అవి 2% కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

వ్యాపార మార్పిడి దశ:

“వ్యాపార మార్పిడి ఫేజ్ 2 ప్రగతిలో ఉంది. ఈ దశను స్థిరపరిచేందుకు వచ్చే రెండు త్రైమాసికాల పాటు మనం దృష్టి సారిస్తాము,” అని కంపెనీ పేర్కొంది.పైసాలో డిజిటల్ లిమిటెడ్ 42 లక్షల మంది కస్టమర్లకు సేవలందించి, 2455 బ్రాంచ్‌ల నెట్‌వర్క్‌తో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విశ్వాసం సంపాదించింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *