PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం.. ఎమ్మార్పిఎస్​ నేత చిత్రపటాలకు పాలాభిషేకం

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు:   వెలుగోడు  పట్టణంలోని రొఖియబీ దర్గ దగ్గర  లో ఉన్న వికలాంగుల హక్కుల పోరాట సమితి   కార్యాలయం దగ్గర వృద్ధులకు, వితంతువులకు హిజ్రాలకు 3000 నుండి 4 వేల రూపాయల పెన్షన్ పెంచినందుకు, డయాల సిస్ వ్యాధిగ్రస్తులకు 10000 పెంచినందుకు అలాగే మంచంలో ఉన్న వాళ్లకు వీల్ చైర్ కు పరిమితమైన   వికలాంగులకు 15000 రూపాయలు పెంచినందుకు, వికలాంగులకు 3000 నుండి 6000 పెన్షన్ పెంచినందుకు వికలాంగుల హక్కుల పోరాట సమితి  ఆధ్వర్యంలో  ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి వికలాంగుల అందరూ కలిసి పలాభిషేకం చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు  అన్నరపు  శేషిరెడ్డి  మాజీ సర్పన్చు యమ్ అబ్దుల్ కలాం,మైనారిటీ నాయకులు పి హిదాయతు అలీ ఖాన్,M అబ్దుల్ రసూల్,ఎస్ అమీర్‌హంజ,డాక్టర్ జాకీర్ హుస్సేన్,mrps నేత నగసెషులు,జనసెన శాలు బాష,మల్లికార్జున,vhps కె గంగాధర్ శెట్టి, హాజరై వికలాంగులతో కలిసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి   అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్ ఇన్తియజ్   మాట్లాడుతూ…ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు   ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రకారము సామాజిక పింఛన్లు మరియు వికలాంగుల పెన్షన్ 3000 నుండి 6000 చేస్తానని హామీ ఇచ్చి జులై నెలలో  వికలాంగుల కు 6000  రూపాయలు,వృద్ధులు వితంతువులకు 4000 పింఛను మరియు  బకాయిలు 3000 కలిపి ₹7,000  ఇవ్వడం జరుగుతుందని, వికలాంగుల పెన్షన్ పెంపు ఫైళ్ళపై సంతకం పెట్టి జీవో కూడా విడుదల చేయడం జరిగిందని దీనివలన వికలాంగుల కుటుంబాలతో పాటు వృద్దులు, వితంతువుల కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయన్నారు.గత ప్రభుత్వంలో వికలాంగులకు పెన్షన్ ఒక రూపాయి కూడా పెంచలేదని, ఆ మూడు వేల రూపాయలు కూడా టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు గారు పెంచిన పింఛన్ అని గుర్తు చేశారు.రాష్ట్రంలో ఉన్న 30 లక్షల వికలాంగుల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని, పించనుతో పాటు వికలాంగులకు ఇంటి స్థలాలు, లోన్స్, మ్యారేజ్ ఫండ్స్ కూడా ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని  ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో vhps జిల్లా అధ్యక్షులు గంగాధర శెట్టి వెలుగోడు మండలం అధ్యక్షులు  కె అబ్దుల్ రవూఫ్,సెక్రెటరి  జె ఇన్తియజ్ నురుల్లమీన్,రహoతుల్లా,ఎల్లమ్మ, ముక్టియర్, పుస్పలత, విష్ణు, శివమ్మ,ఎజాజ్ నిజమొద్దిన్ ,ఖాళీల్‌,నన్నెసా,జకవుల్లా, చాంద్  తదితరులు పాల్గొన్నారు.

About Author