శ్రీ స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలా నక్షత్రం రోజులలో దేవస్థాన సేవగా (సర్కారి సేవగా) జరిపించబడుతోంది.ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవాసంకల్పాన్ని పఠిస్తారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించబడుతుంది.అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేబు చేయించి శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపించబడుతాయి.ఆ తరువాత పల్లకీ ఉత్సవం జరిపించబడుతుంది.