PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

13వ చిల్డ్రన్ క్యాంప్ 2024 ను ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  చైల్డ్ ఇవాంజలిజం ఫెలోషిప్ ఆఫ్ ఇండియా కర్నూల్ వారి ఆద్వర్యంలో నిర్వహిస్తున 13వ చిల్డ్రస్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమము కొల్స్ కళాశాల మైదానము నందు ఈరోజు 7వ తేదీన ఉదయం 10గ.కు. గాలిలో కి బెలూన్స్ వదిలి క్యాంప్ ను పాణ్యం MLA చరిత ప్రారంబించిరి. ముఖ్యా అతిదులు గా CEF నేషనల్ డైరెక్టర్ జయస్ వర్టిస్ కొల్స్ చర్చ్ అద్యక్షులు ADA లింకన్ కోల్స్ కళాశాల ప్రిన్సిపల్ జన్సీ సింయోస్ క్యాంప్ డైరెక్టర్ రెవ. ప్రభుదాస్ కమిటి చైర్మన్ అనిల్ నాథ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ మరియు సునిల్ బెంజమిన్ కలిసి ప్రారంబించిరి.MLA గౌరు చరితా మాట్లాడుతూ బాల్య దశ నుండే భక్తి భావాలను బాలబాలికలకు నేర్పించాలీ అప్పుడే భావి జీవితం లో సన్మార్హము నందు పయనించి ఉత్తమ పౌరులుగా ఎదుగుతరాని ఇలాంటి దైవికమైన క్యాంప్ ను సద్వినియోగపరుచుకొని ఆత్మీయంగా ఎదగలి అన్నారు.క్యాంప్ నిర్వహణ కమిటీ సభ్యులు స్టెల్లా కిరణ్ పాల్ మాట్లాడుచు 3 రోజులు క్యాంప్ ను నిర్వహిస్తామని ఇందులో బైబిల్ బొదనలు భక్తి గీతాలు పప్పెట్ షో క్విజ్ చిరు నాటికలు మొదలగునవి ఉంటాయి అన్నారు.ఈ కార్యక్రమములో సుధీర్, చలపతి, నెహేమ్యా, ప్రాసాద్, రమేశ్, ప్రశాంత్, రాజా రావు, స్వరూప్, స్వర్ణ కుమార్, బబ్లూ మరియు 450 మంది వివిద చర్చ్ కి సంబందించిన బాలబాలికలు వారి తల్లి తండ్రులు 50 మంది వాలంటీర్స్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *