పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కృషి చేయాలి
1 min readచెట్నహల్లి లో ఆకట్టుకున్న గడ్డితో చేసిన భారతదేశ నమూనా
మండలంలో పండగ లా యంపిటి సమావేశం
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: తమ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కృషి చేయాలని సూగురు ఉపసర్పంచ్ గర్జి గోపినాథ్, ప్రధానోపాధ్యాయులు లచ్చప్ప లు అన్నారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాద్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశ కార్యక్రమం పండుగ వాతావరణం లా జరిగింది. నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ పాఠశాల లను పూలమాలలతో తోరణాలతో అలంకరించారు. పాఠశాల ముందు విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు, తండ్రులకు తాడు లాగే ఆటలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బడి నుండి వచ్చిన పిల్లలు చదువుతున్నార లేదా అని కనిపెట్టాలని సూచించారు. చదివే విద్యార్థులకు సెల్ ఫోన్ లు ఇవ్వకుండా చూడాలని కోరారు. చదువు తో పాటు ఆటలు కూడా ఎంతో అవసరం అన్నారు. తమ పిల్లలను దారి తప్పకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. అనంతరం ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు. పిల్లలు చేసిన ప్రసంగాలు, నాటికలు, వేషధారణ ఆకట్టుకున్నాయి. ఈ సమావేశంలో టిడిపి నాయకులు భాస్కర్ రెడ్డి, గోపాల్, నరసింహులు, ఇజ్రాయెల్, నాగరాజు రామకృష్ణ, పాఠశాలల ఛైర్మెన్ లు చిన్న హనుమంతు, ఈరన్న, కురువ రాముడు, డీలర్ బోజప్ప, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. చెట్నహల్లి లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గురురాజ ఆధ్వర్యంలో నిర్వహించిన పిటియం సమావేశం లో తహసీల్దార్ రవి, యంఈఓ 2 రాఘన్న, సర్పంచ్ ఆంజనేయులు, ఎంపిటిసి సభ్యులు రామాంజనేయులు, టిడిపి నాయకులు చేపల నాగేష్, పాఠశాల ఛైర్మెన్ బెస్త పరమేష్, నాగరాజు లు హాజరయ్యారు. ముగ్గుల పోటీల విజేతలకు హాట్ బాక్స్ లను బహుమతులు అందజేశారు. గడ్డి తో ఏర్పాటు చేసిన భారతదేశ నమూనా ఎంత గానో ఆకట్టుకున్నాయి. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు రాఘవన్, రవీంద్ర, శాంతికుమారి, సుశీల లమ్మ, మైమున్, అనురాధ, వరలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.