తల్లిదండ్రులు అనంత లోకాలకు..అనాధలుగా చిన్నారులు
1 min readనా కుమారుడిని కొట్టి చంపారన్న తల్లి
కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నా కుమారుడిని కావాలనే కొట్టి చంపారని తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామంలో గ్రామస్తులు కొట్టడంతో అవమానం భరించలేక ఇంట్లోనే ఉరి వేసుకొని మృతి చెందాడని లక్ష్మాపురం గ్రామానికి చెందిన బుడగ జంగం కుమారి రామాంజనేయులు (30)కు గత 3 సం.ల క్రితం భార్య చనిపోయింది.అప్పటి నుండి గ్రామంలో యువకుడు తిరుగుతూ ఉండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే శనివారం గ్రామానికి చెందిన ముస్లింల ఇంటి తలుపు తట్టాడని ఆగ్రహించి కొంతమంది మృతుని ఇంటి దగ్గరికి వచ్చి చితక బాదినట్లు ఆమె తెలిపారు.ఈ విషయమై ముచ్చుమర్రి పోలీసులకు తెలియజేయడంతో ఆదివారం గ్రామానికి వచ్చి సోమవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని పోలీసులు మాకు చెప్పడం జరిగిందని సోమవారం తెల్లవారు జామున చూసే సరికి తన కుమారుడు ఇంట్లోనే ఉరివేసుకొని మృతి చెందాడ ని ఆమె వాపోయింది. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు.తల్లిదండ్రులు మృతి చెందడంతో పిల్లలు వినయ్ (6),వరుణ్ తేజ్ (3) అనాధలుగా మిగిలారు. ముచ్చుమర్రి పోలీసులు కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరిస్తున్నారు.నా కుమారుని చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకొని కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోరారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ రబ్బానీ పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.