PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదోని కూటమి అభ్యర్థిగా డా. పార్థసారధి నామినేషన్​

1 min read

ఎటువంటి ఆర్బాటం లేకుండా… సాంప్రదాయబద్ధంగా వేసిన వైనం

  • కూటమి (బీజేపీ–జనసేన–టీడీపీ) నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు…
  • బైండోవర్​ పేరుతో… బెదిరింపులకు పాల్పడుతున్నారు…
  •  జాబితాను వెరిఫై చేయాలని సబ్​ కలెక్టర్​ను కోరినట్లు పేర్కొన్న డా. పార్థసారధి

 ఆదోని, పల్లెవెలుగు: ఆదోని (బీజేపీ–జనసేన–టీడీపీ) కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డా. పార్థసారధి శుక్రవారం ఎటువంటి హంగు ఆర్బాటం లేకుండా… సాంప్రదాయబద్ధంగా నామినేషన్​ పత్రాలను ఆదోని అసెంబ్లీ ఎన్నికల అధికారి శివ నారాయణ శర్మకు  అందజేశారు. పత్రాలన్నీ సరిచూసుకున్న తరువాత ఎన్నికల అధికారి శివనారాయణ శర్మ నామినేషన్​ పత్రాలను స్వీకరించారు.  కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, బిజెపి స్టేట్ కోర్ కమిటీ సభ్యులు చంద్రమౌళి , టిడిపి నాయకులు మదిరే భాస్కర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అప్సర్ భాష, గుడిసె కృష్ణమ్మ, శ్రీకాంత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రామచంద్రప్ప, బుద్ధారెడ్డి, బిజెపి నాయకులు ఆదోని అసెంబ్లీ కన్వీనర్ శ్రీరాములు, కో కన్వీనర్ నాగరాజ్ గౌడ్, విజయ్ కృష్ణ జిందే సాయి వేణుగోపాల్, అంజయ్, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ ‘బైండోవర్’ ​పై.. విచారణ జరపండి..

నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, వార్డులలోని బీజేపీ– జనసేన– టీడీపీలకు చెందిన ప్రజలపై అక్రమంగా కేసులు నమోదు చేసి.. బైండోవర్​ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని, దీనిపై  అన్ని పోలీస్​ స్టేషన్లలో జాబితా తెప్పించి…. విచారణ జరపాలని కోరినట్లు ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి వెల్లడించారు. ఎన్నికల అధికారికి నామినేషన్​ పత్రాలు అందజేసిన అనంతరం… బయటకు వచ్చిన డా.పార్థసారధి మీడియాతో మాట్లాడారు. బైండోవర్​ కేసులపై మీడియా, పోలీసులు, అధికారులు, అన్ని పార్టీల నాయకుల మధ్య విచారణ జరిపితే… వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులు, పోలీసులు. నాయకులు, ప్రజలందరిపై ఉందన్నారు.

About Author