గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు
1 min readపల్లెవెలుగు వెబ్ కౌతాళం : మండలం కేంద్రంలో మండల విద్యా అధికారి కార్యాలయంలో శుక్రవారం అదనపు అధికారి వెంకటేశ్వర రెడ్డి,సర్పంచ్ పాల్ దివాకర్, ఆధ్వర్యంలో గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కూటమి నాయకులు వెంకటపతి రాజు,అక్కమ్మ తోట రామకృష్ణ, రామాంజనేయులు,హాజరైయ్యారు.ఈ సందర్భంగా వెంకటపతి రాజు మాట్లాడుతూ.. గ్రామాలలో ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ కార్యక్రమం చేపట్టారన్నారు. ఉపాధి హామీ పథకం విధి విధానాలపై దిశానిర్దేశం,మన పంచాయతీ-మన సాధికారత ఊరు బాగుకోసమే ఈ కార్యక్రమం అని అన్నారు. అనంతరం అక్కమ్మ తోట రామకృష్ణ మాట్లాడుతూ కౌతాళం మేజర్ పంచాయతీలో సమస్యలు ఎన్టీఆర్ నగర్,శివప్ప నగర్,జంగల్ కాలిని,హనుమాన్ నగర్,రోడ్డు, డ్రైనేజ్ సమస్యలు,మరియు తాగునీటి కోసం ఫిల్టర్ బెడ్, ఇతర సమస్యలపై ఆరా తీశారు.సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, స్థానికులతో చర్చించారు. టెక్నికల్ అసిస్టెంట్ మరియప్ప మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి 44 అర్జీ పత్రాలు అందజేశారని తెలిపారు.ఈ సమావేశంలో వైసిపి వైస్ ఎంపీపీ బుజ్జి స్వామి,ఉప సర్పంచ్ సక్రి తిక్కయ్య,సమ్మద్,కూటమి నాయకులు కురువ వీరేష్ , రాజనంధ్,లింగేష్,చిరంజీవి, వలి భాష, రామంజి,కురువల్లి విజయ్,లింగన్న,శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.