21న పుష్పగిరి గిరి ప్రదర్శనలో పాల్గొన్న అన్నమాచార్య వంశస్థుడు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: సద్గురు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 12వ తరం వారసులు తిరుమల శ్రీవారి అన్నమయ్య సంకీర్తన కైంకర్యా పరులు హరి నారాయణ చార్యులు( తాళ్లపాక స్వామి) ఈనెల 21వ తేదీ ఆదివారం ఆచాడ మాసం పౌర్ణమి రోజు ఉదయం పుష్పగిరి క్షేత్రంలో గిరి ప్రదర్శనలో పాల్గొంటున్నట్లు పుష్పగిరి తీర్థ క్షేత్ర గిరి ధర్మ పరిరక్షణ సమితి కార్యనిర్వహకులు. ఆవుల బసిరెడ్డి తెలిపారు. చెన్నూరులో గురువారం విలేకరులతో మాట్లాడుతూ తిరుమల నుంచి ఉదయం పుష్పగిరి చేరుకొని గిరి ప్రదర్శనలో పాల్గొన్న అనంతరం శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి. శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి పౌర్ణమి లాగానే ఆషాడ మాసం పౌర్ణమి కి ఎంతో విశిష్టత ఉందని ఇందులో భాగంగా తాళ్లపాక స్వామి గిరి ప్రదర్శనకు వస్తున్నట్లు తెలియజేశారు. గిరి ప్రదర్శనకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గిరి ప్రదర్శనకు వచ్చే భక్తుల కోసం చెన్నూర్ లో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు.