పల్లె ప్రగతికి బాటలు… గ్రామసభలు..
1 min readపాల్గొన్న అధికారులు నాయకులు ప్రజలు..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: పల్లె ప్రగతికి బాటలు వేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ.నారాచంద్రబాబు నాయుడు మరియు ఉపముఖ్యమంత్రి వర్యులు .పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రభుత్వం చేపట్టిన గ్రామసభల కార్యక్రమంలో భాగంగా. శుక్రవారం నాడు గడివేముల మండల వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారుల సమక్షంలో అధికారులు నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు . నన్నూరులో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గ్రామ సభలో పాల్గొన్నారు. గడివేముల గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద జరిగిన గ్రామసభలో టిడిపి మండల కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డిమాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత జగన్ పాలనలో 5ఏళ్లుగా చీకటిలో మగ్గి పోయిన గ్రామ స్వరాజ్య పంచాయతి వ్యవస్థకు ఊపిరిపోస్తూ గ్రామ సభలను ప్రారంభించడం జరిగినదని. అలాగే 2014-19మధ్య కాలంలో చెత్తనుండి సంపద తయారుచేసే కేంద్రాలను నిర్మిస్తే జగన్ రెడ్డి వాటిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారని .గ్రామ పంచాయతీ రోడ్లు ఊడ్చేందుకు చీపుర్లుకూడా లేక,డ్రైనేజీలు శుభ్ర పరిచేందుకు స్థోమతులేక సర్పంచులు అప్పులుచేసి గ్రామపంచాయతీలను నిర్వహించే పరిస్థితికి తీసుకువచ్చారని.అలాగే రాష్ట్రంలో అనేకమంది సర్పంచులు అప్పులబాధ తాళలేక బ్రతుకుదెరువుకోసం ఊళ్ళువదిలి వెళ్లిపోయారని. కూటమి ప్రభుత్వ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి వైపుగా వడివడిగా అడుగులు వేస్తోందన్నారు.ఈకార్యక్రమంలో గడివేముల ఎంపీడీవో అల్లం శ్రీనివాసరావు., స్పెషల్ ఆఫీసర్రు హరిణి. సర్పంచ్ రవణమ్మ. గ్రామపంచాయతీ అధికారులు రంగడు తారకేశ్వరి., పెద్ద ఎత్తున టిడిపి నాయకులు జనసేన నాయకులు బిజెపి నాయకులు పాల్గొన్నారు .