మాతృమూర్తులందరికీ పతివ్రతా శిరోమణి సావిత్రి ఆదర్శం
1 min readవిశ్వ హిందూ పరిషత్ కర్నూలు నగర మాతృశక్తి కన్వీనర్ శ్రీమతి పావని
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈ రోజు జ్యేష్ట శుద్ధ పౌర్ణమి, రోజున హరిశ్చంద్ర శరీన్ నగర్ లోని శ్రీ సద్గురు త్యాగరాజ సీతారామాలయం లో ఉ: 11:30 గం.లకు “పునిస్త్రీ” లందరూ “మహాపతివ్రత సావిత్రి దేవి” వ్రతం,పూజ నిర్వ హించుకున్నారు.ఆలయ ప్రధానార్చకులు మాళిగి భానుప్రకాష్ షోఢషోపచార పూజ చేయించారు అనంతరం మహా పతివ్రత సావిత్రి యోక్క కథా శ్రవణం జరిగింది.విశ్వ హిందూ పరిషత్ కర్నూలు నగర మాతృశక్తి కన్వీనర్ శ్రీమతి పావని మాట్లాడుతూ సావిత్రి తన పతియైన సత్యవంతుడి ఆయుష్షు 1 సం. మాత్రమే అని తెలిసినా అతని వ్యక్తిత్వం, సత్యవ్రత నిష్టను మెచ్చి అతనినే వివాహం చేసుకుందనీ, అతని ప్రాణాలను తీసుకుపోతున్న యమధర్మరాజునే అడ్డగించి పట్టుబట్టి తిరిగి తన భర్త ప్రాణాలను వెనక్కు తీసుకుందని నేటి మహిళలు కూడా పట్టుదల , సమయస్ఫూర్తి కలిగి ఉండాలని తద్వారా ఎంతటి కష్ట తుల్యమైన పనినైనా సులభంగా సాధించవచ్ఛని మహాపతివ్రత సావిత్రి వృత్తాంతంవల్ల తెలుసుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రఖంఢ మాతృ శక్తి కన్వీనర్ శ్రీమతి లావణ్య, దుర్గావాహిని కన్వీనర్ రాజేశ్వరి , మాతృశక్తిళకమిటీ సభ్యులు మహాలక్ష్మి, కృష్ణవేణి, ఉమామహేశ్వరి, కళ్యాణీ బాయి, పుష్ఫలత, జయ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.