పాలస్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ సెంట్రల్ చర్చ్ 60వ వార్షికోత్సవం
1 min readఘనంగా యూత్ ట్రీట్ కార్యక్రమం
తెలుగు బాప్టిస్ట్ సెంట్రల్ చర్చ్1964 లో స్థాపితం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పాలస్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ సెంట్రల్ చర్చ్ 60వ యూత్ ట్రీట్ కార్యక్రమం స్థానిక పత్తే బాధ మోజెస్ నగర్ లో సంఘ కాపరులు, దైవజనుల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రెవరెండ్ జ్యోతి రాజు హాజరయ్యారు. ఆయనకు సంఘ ప్రసిడెంట్ సంఘ కాపరులు సంఘ సభ్యులుఘన స్వాగతం పలికారు. యూత్ డైరెక్టర్ నేకురు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సంఘ కాపరి రెవరెండ్ రాజేంద్ర కుమార్ పర్యవేక్షణలో 60వ వ్యవస్థాపక వసంత కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ పాలస్ బాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్ సంఘం1964లో సెప్టెంబర్ మాసంలో సంఘ కాపరి రెవరెండ్ చంద్రపాల్, యూత్ డైరెక్టర్ జాన్ సుందర్రావు నేతృత్వంలో ప్రారంభించబడినది. 60 సంవత్సరాలలో యూత్ డైరెక్టర్లు, సంఘ కాపరులచే నేటి వరకు నిర్విరామంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుత డైరెక్టర్ అనిల్ కుమార్ సారధ్యంలో సంఘ కాపరి రెవరెండ్ రాజేంద్ర కుమార్, దైవజనురాలు వి హవల రాజేంద్ర కుమార్ పర్యవేక్షణలో సంఘ కాపరుల ప్రోత్సాహం. సహకారాలతో వివిధ సేవలు. ఆధ్యాత్మికంగా ఎదుగుతూ వర్ధిల్లుచున్నది. ఇంతటి కృప కటాక్షాలు అందిస్తున్న దేవ దేవునికి కృతజ్ఞత స్తుతులు ప్రతి ఒక్కరూ చెల్లించారు.