PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పవన్ కళ్యాణ్ బర్త్ డే..సేవా కార్యక్రమాల్లో జనసేన

1 min read

పట్టణంలో బైక్ ర్యాలీ రక్తదాన శిబిరం మొక్కలు నాటడం కేక్ కటింగ్

ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ జన్మదిన వేడుకలు..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 56 వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.సోమవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో జనసేన పార్టీ నేతలు ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.ఉ 11 గంటలకు పట్టణంలోని శ్రీ రామ థియేటర్ దగ్గర నుండి 120 బైకులతో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ ప్రారంభించి పాత బస్టాండు పగి డ్యాల రహదారి,ఆత్మకూరు మరియు మిడుతూరు రహదారి వైపు బైకులపై జనసేన పార్టీ జెండాలు పట్టుకొని పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు.తర్వాత జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు “క్లీన్ ఆంధ్ర..గ్రీన్ ఆంధ్ర” పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు హాజరయ్యారు.వారు మొక్కలు నాటి అనంతరం అక్కడే భారీ కేకును కట్ చేశారు.కార్యకర్తలు ఒకరినొకరు సంతోషంగా కేకును పంచుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 50 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నల్లమల రవికుమార్,జనసేన నాయకులు శ్రీ రామ థియేటర్ యజమాని మండలం రామిరెడ్డి,అఖిల భారత చిరంజీవి నందికొట్కూరు అధ్యక్షులు నవీన్ రెడ్డి, రాయలసీమ జోనల్-2 మధు,సంపత్,రాజు, రెహమాన్,నాగరాజు,పుష్ప రాజ్,శరత్,తిక్కరాజు,మహేష్, నాగేష్,సురేష్,ఆటో రవి,ఆటో చరణ్ తదితరులు పాల్గొన్నారు.

About Author