స్టాక్ స్ల్పిట్ కోసం తేదీని ప్రకటించిన పీసీ జువెల్లర్ లిమిటిడ్
1 min readపల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : భారతదేశంలోని అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆభరణాల చైన్ పీసీ జువెల్లర్ లిమిటెడ్ (బిఎస్ఇ: 534809, ఎన్ఎస్ఇ: పీజీ జువెల్లర్ ) తన ఈక్విటీ షేర్లను 1:10 నిష్పత్తిలో విభజించడం (స్టాక్ స్ప్లిట్) కోసం డిసెంబర్ 16, 2024ను రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. అంటే, ఒక ఈక్విటీ షేర్‌ను పది ఈక్విటీ షేర్లుగా విభజిస్తారు.ఇటీవలి కాలంలో, కంపెనీ 3,38,85,000 వారెంట్లను ఈక్విటీ షేర్లు గా మార్చడం ద్వారా రూ. 142.82 కోట్ల నిధులు సమీకరించింది. ఈ వాటాలను ‘నాన్-ప్రొమోటర్, పబ్లిక్ కేటగిరీ’కి చెందిన 35 మందికి కేటాయించింది.2024 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో పీసీ జువెల్లర్ అత్యుత్తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. క్యూ2 ఎఫ్ వై25లో రూ. 505 కోట్ల ఆదాయం నమోదు చేసి, 1430% వృద్ధిని సాధించింది. ఏబిటా రూ. 129 కోట్లు, పిబిటి రూ. 124 కోట్లు గా ప్రకటించారు.కంపెనీ సమాఖ్య బ్యాంకులతో తన సమస్యల పరిష్కారం కోసం చేసిన ఒప్పందం (ఓటిఎస్) అన్ని 14 బ్యాంకుల అంగీకారాన్ని పొందింది. సెప్టెంబర్ 30, 2024న ఈ ఒప్పందం సంతకం చేయబడింది.2005లో తన మొదటి షోరూమ్‌ను కరోల్ బాగ్, న్యూఢిల్లీలో ప్రారంభించిన పీసీ జువెల్లర్, నేడు భారతదేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలలో ప్రాముఖ్యమైన నగల వ్యాపారంగా నిలిచింది. నాణ్యత, వినియోగదారుల నమ్మకంతో పాటు ఆధునికతతో కూడిన డిజైన్లు పీసీ జువెల్లర్ ప్రత్యేకత.