PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలన్నీ పరిష్కరించాలి : పిడిఎస్ఓ డిమాండ్

1 min read

పల్లెవెలుగు   వెబ్  ఎమ్మిగనూరు : రాష్ట్ర పిలుపులో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల నుండి ర్యాలీగా వచ్చి ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా చేసి డిప్యూటీ తాసిల్దార్ శ్రీదేవి గారికి ప్రతిపత్రం ఇచ్చి ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ జిల్లా ఉపాధ్యక్షుడు సురేంద్రబాబు మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం, మరోపక్క సిబిఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియం, సెమిస్టర్ పద్ధతి, బైజూస్ కంటెంట్, ట్యాబుల పంపిణీ, టోఫెల్ పరీక్ష… ఇలా విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేని విధానాలను, పద్ధతులను ప్రవేశపెట్టి ఇటు విద్యార్థులను, అటు ఉపాధ్యాయులను గందరగోళ పరిచారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా ఈ ఈ విధానాలను రద్దు చేయడం లేదు. తక్షణమే పాఠశాలల విలీనాన్ని వెంటనే ఆపాలని,మూసివేసిన పాఠశాలలు అన్నింటినీ తెరవాలని,రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 39,008 ఉపాధ్యాయ పోస్టులను, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,888 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని, 98 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న యూపీ స్కూళ్లలో ‘స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 150 నుంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న హైస్కూళ్లలో ప్రధానోపాధ్యాయుడి’ మరియు ‘పిడి’ పోస్టులను రద్దు చేయడాన్ని ఆపాలని,ఒకటి నుండి పదవ తరగతి వరకు మాతృభాషా మాధ్యమాన్నే కొనసాగించాలని ,నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని, అల్పాహారాన్ని అందించాలని ,పాఠశాలల్లో పరిశుభ్రమైన త్రాగునీరు, మరుగుదొడ్లు, ఆటస్థలం, సైకిల్ స్టాండ్, ఇతర మౌళిక వసతులను కల్పించాలని,విద్యార్థులకు సరిపడా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయాలని ,పాఠశాలలకు, సంక్షేమ, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి,ఉపాధ్యాయుల బోధన సమయాన్ని కాలరాస్తున్న ఆన్లైన్ అప్లోడింగ్స్ (హాజరు, ఫోటోలు….) కార్యక్రమాన్ని నిలిపివేయాలని,పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలను పెంచాలి. కాస్మోటిక్, మెయింటినెన్స్ చార్జీలను అందించాలని ,అన్ని హాస్టల్స్లో ఖాళీగా ఉన్న కుక్, కమాటి, వాచ్మెన్ పోస్టులను భర్తీ చేయాలి. 13) హాస్టల్స్లో విద్యార్థులకు ఎప్పటికప్పుడు హెల్త్ టెస్టులు నిర్వహిస్తూ, దోమల తెరలను, హెల్త్ కిట్లను మంజూరు చేయాలని,పాఠశాల విద్యార్థులకు అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బస్సు సౌకర్యాలు కల్పిస్తూ ఉచిత బస్సు సేవలను అందించాలని ,పాఠశాల విద్యార్థులకు సెమిస్టర్ పద్ధతిని రద్దు చేయాలని పిడిఎస్ఓగా డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పి డి ఎస్ ఓ తాలూకా అధ్యక్ష కార్యదర్శులు వీర ప్రతాప్ ఇమ్రాన్ భాష ఉపాధ్యక్షులు మహమ్మద్ , నాయకులు పవన్ సలీం నవీన్ తదితరులు పాల్గొన్నారు.

About Author