పీడీఎస్ యు 50 వసంతాల లోగో ఆవిష్కరణ..
1 min readపట్టణంలో భారీ విద్యార్థులతో భారీ ర్యాలీ
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: విప్లవోద్యమాల వేగుచుక్క పిడిఎస్.యు 50 వసంతాల లోగో ఆవిష్కరణ అనంతరం పటేల్ సర్కిల్ నందు పిడిఎస్ యు విద్యార్థి పోరాటాల సంఘీభావంగా మానవహారం నిర్వహించిన విద్యార్థులు విప్లవోద్యమాల వేగుచుక్క ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) 50 వసంతాల లోగో ఆవిష్కరించారు మంగళవారం నందికొట్కూరు పట్టణంలో వైష్ణవి జూనియర్ డిగ్రీ కళాశాల అధినేత రవీంద్రబాబు,మాజీ పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు శేఖర్ నాయుడు,పిడిఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎం డి రఫీ,రాష్ట్ర నాయకులు నాగరాజు విష్కరించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో పిడిఎస్ యు ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి పటేల్ సర్కిల్ వద్ద 300 మంది విద్యార్థి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి మానవహారం చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1974 అక్టోబర్ లో ఏర్పడిన పిడిఎస్ యు 2024 అక్టోబర్ నాటికి 50 ఏళ్ళు నిండిన సందర్భంగా దేశ వ్యాప్తంగా విప్లవ విద్యార్థి ఉద్యమాల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు ఉద్యమం కర్తవ్యాలను రూపొందించుకునే లక్ష్యంతో సభలు సమావేశాలు నిర్వహించాలని విద్యార్థి పిలుపు ఇచ్చారు.శాస్త్రీయ విద్య లక్ష్యంగా విద్యార్థుల హక్కుల కోసం రాజీలేని లేని పోరాటాలను పిడిఎస్ యు నిర్వహించింది.ఉద్యమాలను అణచివేయాలని ప్రయత్నించినా విద్యార్దులు మరింత ఉత్తేజంతో పనిచేశారని 50 వసంతాల సందర్భంగా విద్యార్థులను చైతన్యం చేయడానికి కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ నాయకులు శ్రీరాములు ప్రవీణ్ పిడిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు యు నవీన్ కుమార్,జిల్లా సహాయ కార్యదర్శి బాలాజీ,పిడిఎస్ యు మధు,మధుగిరి పాల్గొన్నారు.