PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎల్లమ్మ జాతర ప్రశాంతం…

1 min read

జాతర ఊరేగింపులో విస్తృత పోలీస్ బందోబస్తు

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండల కేంద్రమైన చెన్నూరులో ఆదివారం ఎల్లమ్మ జాతర ప్రశాంతంగా ముగిసింది. చెన్నూరు కు కిలోమీటర్ దూరంలో వెలసిన ఎల్లమాంబ జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం చెన్నూరు పోలయ్య గారి వీధి నుంచి ఎల్లమ్మ సోదరుడైనటువంటి పోతులూరయ్య స్వామి ఉత్సవ విగ్రహాన్ని ట్రాక్టర్ ఫై అలంకరణ ఊరేగింపుగా రెడ్డి వారి వీధి బ్రాహ్మణ వీధి పార్కు వీధి బస్టాండ్ మెయిన్ రోడ్డు రెవిన్యూ కార్యాలయం పోలీస్ స్టేషన్ మీదుగా ఎల్లమ్మ ఆలయం వరకు ఊరేగింపు కొనసాగింది. ఈ ఊరేగింపులో భారీ ఎత్తున కర్ర సాములు కత్తి సాములు చేసుకుంటూ డప్పుల మద్ద చిందులు వేస్తూ ఊరేగింపు కొనసాగింది. నగరానికి చెందిన చిన్నారులు మహిళలు కర్ర సాము కత్తి సామ్ లో ప్రత్యేక నైపుణ్యత ప్రదర్శించారు. దారి పొడవునా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చెన్నూరు సిఐ పార్థసారథి ఆధ్వర్యంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుంచి ఊరేగింపు జరుగుతున్న ప్రదేశాల్లో దుకాణాలు పోలీసులు మోసి వేయించారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన ఊరేగింపు సాయంత్రం ఐదున్నర గంటలకు ఐదున్నర గంటలకు ముగిసింది. జాతర ఊరేగింపులో డి.ఎస్.పి షరీఫ్ నలుగురు సీఐలు. ఎనిమిది మంది ఎనిమిది మంది ఎస్సై హెడ్ కానిస్టేబుల్స్. విజిలెన్స్ ఇతర బెటాలియన్ సిబ్బంది. సివిల్ పోలీసులు నిర్వహించారు. జాతర దృష్టిలో పెట్టుకొని ఎల్లమ్మ ఆలయం వద్ద పోలీసులు విస్తృత విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూ ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి అమ్మవారికి ముక్కు బడి కలిగిన వారు జంతు బలులు మహిళలు బోనాలు అమ్మవారికి సమర్పించుకున్నారు.

About Author